Mahaa Daily Exclusive

  ప్రమాదకరమైన చెట్ల కొమ్మల తొలగింపు: రామగుండం ఎన్టీపీసీ రోడ్డుపై క్లియర్ చేసిన హెచ్‌కెఆర్ సిబ్బంది!

Share

అప్రమత్తమైన అధికారులు ఎన్టీపీసీ రోడ్డు పక్కన ప్రమాదకరంగా ఉన్న కొమ్మలను తొలగించిన హెచ్‌కెఆర్ సిబ్బంది.

రామగుండం జూన్ 26 మహా పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ఎన్టీపీసీ మెటీరియల్ గేట్ సమీపంలో రోడ్డు పక్కన ప్రమాదకరంగా పెరిగిన చెట్ల కొమ్మలను హెచ్‌కెఆర్ (HKR) సిబ్బంది గురువారం చెట్ల ను తొలగించారు. ఈ మార్గంలో రోడ్డుకు అడ్డంగా పెరిగిన కొమ్మల వల్ల వాహనదారులకు ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, స్పందించి చర్యలు తీసుకోవాలని కార్మికులు అధికారులకు విన్నవించిన విషయం తెలిసిందే.ప్రతిరోజూ సుమారు 4 వేల మందికి పైగా కార్మికులు రాకపోకలు సాగించే గోదావరిఖని-కరీంనగర్ ప్రధాన రాజీవ్ రహదారిపై ఈ పరిస్థితి నెలకొంది. వాహనదారులు, కార్మికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, స్పందించిన హెచ్‌కెఆర్ సిబ్బంది వెంటనే ఆ చెట్ల కొమ్మలను నరికివేసి రహదారిని క్లియర్ చేశారు. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గడమే కాకుండా, కార్మికుల ప్రయాణం సురక్షితంగా మారిందని స్థానికులు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో స్పందించి చర్యలు తీసుకున్న అధికారులకు వారు ధన్యవాదాలు తెలిపారు.