Mahaa Daily Exclusive

  జన చైతన్య సభలో కాంగ్రెస్ ప్రభుత్వం పై కేటీఆర్ విమర్శల పై జంగా రాఘవరెడ్డి కౌంటర్

Share

  • జన చైతన్య సభలో కాంగ్రెస్ ప్రభుత్వం పై కేటీఆర్ విమర్శల పై జంగా రాఘవరెడ్డి కౌంటర్
  • తిరుపతి రెడ్డి బిఆర్ఎస్ పార్టీలో ఎందుకు చేరారు?
  • ఏకశిల ఫౌండేషన్‌ పై ఉన్న ఆరోపణలు, కేసుల వ్యవహారాల పై ప్రజలకు స్పష్టత ఇవ్వాలి
  • తెలంగాణ రాష్ట్ర ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి

హనుమకొండ, మహా ;

జన చైతన్య సభలో కాంగ్రెస్ ప్రభుత్వం పై కేటీఆర్ చేసిన విమర్శల పై జంగా రాఘవరెడ్డి సోమవారం ఘాటైన కౌంటర్ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీలో చేరితే కేసుల నుంచి ఉపశమనం లభిస్తుందనే ఉద్దేశంతో ఒక ముఖ్య నాయకుడిని సంప్రదించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి, టిపిసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆయన చేరికకు అంగీకరించలేదనే రాజకీయ పరిణామాల తర్వాత కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం చర్చనీయాంశంగా మారింది.

ఈ పరిణామాల పై తిరుపతి రెడ్డి ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ఉందన్నారు.
కాగా ఇప్పుడు తిరుపతి రెడ్డి బిఆర్ఎస్ పార్టీలో చేరడం వెనుక ఉద్దేశం ఏమిటంటే,ఆయన చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికేనా? రేపు తనపై ఎలాంటి విమర్శలు వచ్చినా, బిఆర్ఎస్ పార్టీలో చేరినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించడానికే పార్టీ మారారా? అనే ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయి.

అయితే,తిరుపతి రెడ్డి గతంలోనే బిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా పనిచేశారు. అలాంటప్పుడు ఇప్పుడు కొత్తగా బిఆర్ఎస్ పార్టీలో చేరడం వెనుక అసలు కారణం ఏమిటి? గతంలోనే బిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు అధికారికంగా ఆ పార్టీలో చేరాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? తనపై ఉన్న ఆరోపణలు,కేసుల నుంచి తప్పించుకోవడానికే ఈ రాజకీయ పార్టీ మార్పు జరిగిందా? అనే సందేహాలకు తిరుపతి రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలి.
కేటీఆర్… గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో రాష్ట్ర అప్పులు,కాళేశ్వరం ప్రాజెక్టు, రైతుల సమస్యలు,విద్యారంగ పరిస్థితిపై కూడా సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మూడు సంవత్సరాల పాలనలో రైతు రుణమాఫీ, రైతు భరోసా,మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,ఉచిత విద్యుత్,ఇందిరమ్మ ఇళ్లు,యువతకు ఉద్యోగాలు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది.

ఇతరులపై విమర్శలు చేసే ముందు మీ గత పాలనపై ప్రజలకు సమాధానం చెప్పండి.
రాజకీయాలు మాటలతో కాదు.. ప్రజలకు చేసిన పనులతో నిరూపించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్
జంగా రాఘవరెడ్డి హితవు పలికారు.