Mahaa Daily Exclusive

  ఆర్ధిక ఇబ్బందులు భరించలేక రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య

Share

 

హైదరాబాద్, మహా :
రైలు కిందపడి దంపతులు మృతి చెందిన ఘటన గురువారం రాత్రి ఘట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది, ఆర్థిక ఇబ్బందులు తాళలేక, కట్టుకున్న భార్యతో కలిసి ఓ భర్త రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

క్షణికావేశంలో వారు తీసుకున్న ఈ నిర్ణయం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్య పేట గ్రామానికి చెందిన రవికుమార్ (32), శిరీష (28) దంపతులు. గత కొంతకాలంగా వీరు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. అప్పుల భారం పెరగడం, వాటిని తీర్చే మార్గం కనిపించకపోవడంతో జీవితంపై విరక్తి చెందారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి మేడ్చల్ జిల్లా ఘట్‌ కేసర్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పైకి చేరుకుని, వేగంగా వస్తున్న రైలు కింద పడి ప్రాణాలు విడి చారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాలను పరిశీలిం చారు. మృతుల వద్ద లభించిన ఆధారాల ఆధారంగా వారు వరంగల్ జిల్లాకు చెందిన దంపతులు గా గుర్తించి, సమా చారాన్ని వారి కుటుంబ సభ్యులకు అందించారు.

Latest