- విద్యార్థులు, యువతతోనే అదిసాధ్యం
- ఇండియన్ సదస్సులో ఈగల్ ఫోర్స్ అడిషనల్ ఎస్పీ కృష్ణమూర్తి
హైదరాబాద్, మహా : రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు, యువతను చైతన్యవంతుల్ని చేస్తూ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దే దిశగా విశేషంగా కృషి చేస్తుందని ఈగల్ ఫోర్స్ అడిషనల్ ఎస్పీ పి.కృష్ణమూర్తి తెలిపారు శనివారం యూసుఫ్ గూడా లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజర్స్ లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో యంగ్ ఇండియన్స్ నిర్వహించిన యంగ్ ఇండియన్స్ పార్లమెంట్ – 2026 సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు
ఈ సందర్భంగా విద్యార్థుల చేత డ్రగ్ ఫ్రీ కోసం ప్రమాణం చేయించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ నివారణకు చేపడుతున్న చర్యలను, తీసుకుంటున్న కఠిన నిర్ణయాలను విద్యార్థులకు వివరించారు. యంగ్ ఇండియన్స్, హైదరాబాద్ చాప్టర్ చేస్తున్న కార్యక్రమాలను ఆయన కొనియాడారు.
Post Views: 2








