Mahaa Daily Exclusive

  ట్రిపుల్ ఐటీలో విషాదం..! ఆరో అంతస్తు నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య..

Share

  • మృతుడు మహబూబాబాద్ జిల్లాకు చెందిన అభిరూప్‌గా గుర్తింపు
  • కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

 

హైదరాబాద్‌, మహా : గచ్చిబౌలిలోని ప్రతిష్ఠాత్మక ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో విషాదం చోటుచేసుకుంది. శనివారం ఓ భవనం ఆరో అంతస్తు నుంచి దూకి 20 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని మహబూబాబాద్ జిల్లాకు చెందిన అభిరూప్‌గా పోలీసులు గుర్తించారు. శనివారం క్యాంపస్‌లోని ఓ భవనంపై నుంచి కిందకు దూకడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న క్యాంపస్ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

 

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రానికి చెందిన అభిరూప్‌ ట్రిపుల్ ఐటీలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. అతను గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. ఒకవైపు చదువు ఒత్తిడి, మరోవైపు అనారోగ్య సమస్యలు తోడవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆరో అంతస్తు నుంచి దూకడంతో తీవ్ర గాయాలపాలై అభిరూప్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Latest