Mahaa Daily Exclusive

  ప్రజా సమస్యలపై సమరం… ప్రజల పక్షాన నిరంతర పోరాటం..!

Share

ఖైరతాబాద్ నియోజకవర్గం వెంకటేశ్వర కాలనీ డివిజన్ గురు బ్రహ్మ నగర్లో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న “సమస్యలపై సమరం” కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఖైరతాబాద్ నియోజకవర్గ బి.ఆర్.ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) గారు విస్తృతంగా పర్యటించారు.

 

ఈ సందర్భంగా స్థానికులు తమ ప్రాంతంలో నెలకొన్న అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. గత మూడు సంవత్సరాలుగా ఐమాక్స్ స్ట్రీట్ లైట్లు వెలగకపోవడం, సాధారణ స్ట్రీట్ లైట్లు లేకపోవడం, ప్రధాన రహదారిపై స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో బైకులు అతివేగంగా దూసుకెళ్తుండటంతో స్కూల్ విద్యార్థులు, స్థానికులకు ప్రమాదం పొంచి ఉందని, వెంటనే ఆరు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, తాగునీటి సరఫరాలో నెలకొన్న ఇబ్బందులను కూడా వివరించారు.

 

ఈ సందర్భంగా మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) గారు మాట్లాడుతూ…

“కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించింది. కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేక ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రజలు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించని పరిస్థితి నెలకొనడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. బి.ఆర్.ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి ప్రతి సమస్య పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతుంది.” అని స్పష్టం చేశారు.

 

అనంతరం సంబంధిత జీహెచ్‌ఎంసీ మరియు వాటర్ వర్క్స్ అధికారులకు నేరుగా ఫోన్ చేసి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. రెండు వీధుల్లో కొత్త రోడ్ల నిర్మాణం, తాగునీటిని సమయానికి సరఫరా చేయడం, తగిన నీటి ఒత్తిడితో నీటిని విడుదల చేయడం, స్ట్రీట్ లైట్ల ఏర్పాటు, స్పీడ్ బ్రేకర్ల నిర్మాణం వంటి అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

 

ప్రజల సమస్యలే మా అజెండా… ప్రజల కోసం మా పోరాటం నిరంతరం కొనసాగుతుంది!