Mahaa Daily Exclusive

  ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నం..! పెట్రోల్ బాంబు దాడులకు ఐఎస్ఐ కుట్ర..!

Share

న్యూఢిల్లీ, మహా : దిల్లీ పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. పాకిస్థాన్ ఐఎస్ఐ హ్యాండ్లర్ షెహజాద్ భట్టీ పర్యవేక్షణలో దిల్లీపై పెట్రోల్ బాంబు దాడులకు కుట్ర పన్నినట్లు వారు గుర్తించారు. బుధవారం దిల్లీ, పంజాబ్ల్లో ఆరుగురు అనుమానిత వ్యక్తులను దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అరెస్టు చేసింది. వారిని తమదైన రీతిలో విచారణ చేయగా, ఈ కుట్ర గురించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. “పాకిస్థాన్కు చెందిన ఐఎస్ఐ హ్యాండ్లర్ షెహజాద్ భట్టీ ఆదేశాల మేరకు దేశ రాజధాని దిల్లీలోని పలు కీలక ప్రాంతాల్లో పెట్రోల్ బాంబు దాడులు చేయడానికి ఉగ్రవాదులు కుట్ర పన్నారు. ముఖ్యంగా దిల్లీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో ఉన్న న్యూ పోలీస్ లైన్స్, ఆనంద్ విహార్ ఇంటర్-స్టేట్ బస్ టెర్మినల్, రైల్వే స్టేషన్ సహా విపరీతమైన రద్దీ ఉండే మార్కెట్ ప్రాంతాల్లో వారు రెక్కీ నిర్వహించి, దాడులు చేయడానికి ప్లాన్ చేశారు” అని పోలీసులు తెలిపారు.