- చర్చలు కొనసాగించడం సమయం వృథా అని వ్యాఖ్య
- ఇరాన్‌పై అమెరికా భారీ ప్రతీకార దాడులు
- పాకిస్థాన్ మధ్యవర్తిత్వం విఫలం
మహా : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో కుదిరిన తాత్కాలిక అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) ఇక ముగిసినట్టేనని సంచలన ప్రకటన చేశారు. ఆ దేశంతో చర్చలు కొనసాగించడం సమయం వృథా అంటూ మండిపడ్డారు. అయితే అమెరికా ప్రతినిధులు చర్చలు కొనసాగించాలనుకుంటే తనకు అభ్యంతరం లేదని చెప్పారు. హర్మూజ్ జలసంధిలో నౌకలపై దాడులకు ప్రతీకారంగా అమెరికా ఇరాన్‌లోని బందర్ అబ్బాస్, సిరిక్ పోర్టు నగరాలు, ఖెష్మ్ ద్వీపంలోని లక్ష్యాలపై విరుచుకుపడింది. అదే సమయంలో ఇరాన్ చమురు విక్రయాలకు ఇచ్చిన అనుమతిని కూడా రద్దు చేసింది. దీనికి ప్రతీకారంగా బహ్రెయిన్, కువైట్‌లపై ఇరాన్ దాడులు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో నాటో సదస్సు సందర్భంగా మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ‘‘నా దృష్టిలో ఇరాన్‌తో చర్చలు ముగిసిపోయాయి. వారితో ఇక చర్చించాలని నాకు లేదు. వాళ్లతో చర్చలు జరపడం సమయం వృథా’’ అని పేర్కొన్నారు. ఇరాన్ నాయకత్వంపై కూడా ట్రంప్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘వాళ్లు ప్రమాదకరమైన వ్యక్తులు. అణ్వాయుధాలు వారి చేతికి వస్తే కచ్చితంగా ఉపయోగిస్తారు. అందుకే నా దృష్టిలో చర్చలు ముగిసినట్టే’’ అని వ్యాఖ్యానించారు.
టర్కీ రాజధాని అంకారాలో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు సంబంధించి చేశారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, “ఇప్పుడు అవగాహన ఒప్పందం ముగిసిపోయిందని నేను భావిస్తున్నాను” అని ట్రంప్ అన్నారు. అమెరికా, ఇరాన్‌ల మధ్య పరిస్థితి ఎంతగా ముదిరిందంటే, ఇరు దేశాల మధ్య ఒప్పందం భవిష్యత్తు ముగిసిపోయిందని భావించాలని ఆయన సూచించారు. “నిన్న రాత్రి ఇరాన్‌లోని అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులపై శక్తివంతమైన దాడి చేశాము” అని ట్రంప్ అన్నారు. ఈ చర్య అమెరికా భద్రతకు అత్యవసరమని ఆయన అభివర్ణించారు ఈ ఆపరేషన్‌ను చాలా స్ట్రాంగ్‌గా నిర్వహించామని చెప్పారు. “వారికి జబ్బుంది, వారిలో ఏదో లోపం ఉంది” అని అన్నారు. అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో, ఇరు దేశాల మధ్య ఇటీవలి సైనిక పరిణామాలు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మారిన టైంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఈ 60 రోజుల మధ్యంతర ఒప్పందం కుదిరింది. ఘర్షణకు శాశ్వత పరిష్కారం చూపేందుకు పరోక్ష చర్చలకు అవకాశం కల్పించేందుకు లక్ష్యంతో ఈ కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే, ఖతార్‌లో జరిగిన చర్చలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు. ఇంతలో అమెరికా మంగళవారం ఇరాన్ లక్ష్యాలంగా దాడులు మొదలు పెట్టింది. దీనికి తోడు ట్రంప్ కూడా తీవ్రంగా స్పందించారు. “వారు అబద్ధాలకోరులు, మోసగాళ్ళు, రోగులు,” అని విరుచుకుపడ్డారు. ఇరాన్ అధికారులతో తదుపరి చర్చలు జరపడానికి తనకు ఆసక్తి లేదని పేర్కొన్నట్లు నివేదికలు తెలిపాయి.
వాషింగ్టన్- టెహ్రాన్ మధ్య సంబంధాలు వేగంగా క్షీణిస్తున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపించుకుంటున్నాయి. హోర్ముజ్ జలసంధిలో జరిగిన దాడులకు ప్రతిస్పందనగా ఈ దాడులు జరిగాయని అమెరికా పేర్కొంది. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై ఇరాన్ చేసిన దాడులకు ప్రతిస్పందనగా అమెరికా సైనిక దాడులు జరిపినట్లు సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) తెలిపింది. ఈ దాడుల అనంతరం మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. తన ప్రసంగంలో ఇరాన్లో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను ట్రంప్ ప్రస్తావించారు. ఇరాన్ అధికారులు తీవ్రమైన అణచివేతకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.
వాషింగ్టన్‌పై టెహ్రాన్ తీవ్ర ఆరోపణలు
అమెరికా పదే పదే చేస్తున్న దాడులను ఇరాన్ అధికారులు తీవ్రంగా ఖండించారు. ఇవి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని, ఈ ప్రాంతంలో వాషింగ్టన్ మరింత అస్థిరతను సృష్టిస్తోందని ఆరోపించారు. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని అమెరికా పదేపదే ఉల్లంఘించిందని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. పదేపదే జరుగుతున్న ఈ దురాక్రమణ చర్యలకు టెహ్రాన్ ప్రతిస్పందిస్తుందని హెచ్చరించింది.






