Mahaa Daily Exclusive

  ఎమ్మెల్యే మెప్పు కోస‌మే న‌గేష్ ఆరాటం -మంగేష్…

Share

  • ఎమ్మెల్యే మెప్పు కోస‌మే న‌గేష్ ఆరాటం -మంగేష్
  • పాయ‌ల్ శంక‌ర్ భూకబ్జాపై ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను ఖండించిన కాంగ్రెస్ లీగ‌ల్ సెల్ చైర్మ‌న్
  • ప్ర‌జాభ‌వ‌న్ ను కూల్చుతామ‌న్న వ్యాఖ్య‌ల‌పై మండిపాటు
  • అది కంది శ్రీ‌నివాస రెడ్డి స్వంత డ‌బ్బుల‌తో నిర్మించార‌ని వెల్ల‌డి
  • నిజాలు తెలుసుకుని మాట్లాడాలని హిత‌వు

ఆదిలాబాద్ : 72\3 స‌ర్వేనంబ‌ర్ లో ఆదిలాబాద్ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే పాయ‌ల్ శంక‌ర్ భూక‌బ్జాపై కాంగ్రెస్ పార్టీ క‌లెక్ట‌ర్ ఎస్పీకి , అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ కు ఫిర్యాదు చేసిన విష‌యంపై బీజేపీ నాయ‌కుడు ఎన్రాల న‌గేష్ ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్య‌లు ఆదిలాబాద్ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేవిధంగా ఉన్నాయ‌ని కాంగ్రెస్ లీగ‌ల్ సెల్ చైర్మ‌న్ మంగేష్ అన్నారు. శుక్ర‌వారం ఆయ‌న పార్టీ శ్రేణుల‌తో క‌లిసి కంది శ్రీ‌నివాస రెడ్డి క్యాంపు కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడారు.ఆ స్థ‌లం ప్ర‌భుత్వ భూమి అని క్ర‌య‌విక్ర‌యాల‌కు ఎలాంటి ఆస్కారం లేద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఉత్త‌ర్వులున్నా ఎమ్మెల్యే అక్ర‌మంగా రిజిస్ట్రేష‌న్ చేయించుకున్నార‌న్నారు. త‌న భార్య పేరుపై ఏకంగా 11 ప్లాట్ల‌ను ఎన్వోసి ర‌ద్దు చేసి రిజిస్ట్రేష‌న్ చేయించుకున్నార‌ని మీడియాకు ఆధారాలు చూపించారు.అంతే కాకుండా అదే స‌ర్వేనంబ‌ర్ లో త‌న అల్లుడు సిద్దార్ధ పేరుపై నాలుగు మ‌రో రెండు ప్లాట్ల‌ను త‌న ప‌నివాళ్ళ పేరుపై రిజిస్ట్రేష‌న్ చేయించార‌ని ఆరోపించారు. ఈ విష‌యంపై త్వ‌ర‌లో క‌లెక్ట‌ర్ ఎస్పీకి ఫిర్యాదు చేస్తామ‌ని తెలిపారు.పాయ‌ల్ శంక‌ర్ పై ఎలాంటి ఆరోప‌ణలొచ్చినా వెంట‌నే ప్రెస్ మీట్ పెట్టి ఖండించే న‌గేష్ కు ఈ విష‌యాలు తెలియ‌దా అని ప్ర‌శ్నించారు. కేవ‌లం ఎమ్మెల్యే మెప్పు పొందేందుకే నగేష్ మీడియా ముందుకు వ‌స్తున్నార‌న్నారు.ఒక బీసీ ఎమ్మెల్యే డ‌బ్బులు సంపాదిచుకోవ‌ద్దా అని ప్ర‌శ్నిస్తున్నార‌ని న్యాయంగా సంపాదించుకుంటే త‌మ కేమీ అభ్యంత‌రం లేద‌ని కాని ప్ర‌భుత్వ భూముల‌ను క‌బ్జా చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమ‌న్నారు.అలాగే ప్ర‌జాభ‌వ‌న్ కూల‌గొడ‌తామంటూ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి పై చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తున్నామ‌న్నారు.ఆయ‌న త‌న స్వంత డ‌బ్బుల‌తో ప్ర‌జ‌ల సేవ కోసం భ‌వ‌నం నిర్మించుకున్నార‌ని, ఆయ‌న ఆరోపించిన‌ట్టు అక్ర‌మంగా ఏదీ లేద‌న్నారు.దానికి సంబంధించిన డాక్యుమెంట్ల‌న్నీ త‌మ వ‌ద్ద ఉన్నాయ‌న్నారు. అంతే కాకుండా ఆయ‌న గ‌త నాలుగేళ్లుగా ప్ర‌జాసేవాభ‌వ‌న్ ఆవ‌ర‌ణ‌లో పేద‌ల‌కు అన్న‌దానం చేస్తున్నార‌ని ఇప్ప‌టివ‌ర‌కు కొన్ని ల‌క్ష‌ల‌మంది ఆక‌లి తీర్చార‌ని అన్నారు. అలాంటి వ్య‌క్తి పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌రి కాద‌న్నారు.నిజాలు తెలుసుకుని మాట్లాడాలని హిత‌వు ప‌లికారు. మీ పార్టీ కార్యాల‌య స్థ‌లం పైనే అనుమానాలున్నాయ‌ని నిజంగా అది స‌క్ర‌మ‌మే అయితే ప్రారంభోత్స‌వానికి రాష్ట్ర పార్టీ పెద్ద‌లు ఎందుకు రాలేద‌ని ప్ర‌శ్నించారు.ఒక న్యాయ‌వాదిగా మీకు అన్నీ తెలిసినా ఎమ్మెల్యే ను స‌మ‌ర్ధిస్తూ వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని మీ విజ్ఞ‌త కే వ‌దిలేస్తున్నామ‌ని అన్నారు. ఈ మీడియా స‌మావేశంలో
కాంగ్రెస్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు ఖిజ‌ర్ పాషా, మున్సిప‌ల్ ఫ్లోర్ లీడ‌ర్ ఇజ్జ‌గిరి సంజ‌య్, మాజీ మున్సిప‌ల్ ఫ్లోర్ లీడ‌ర్ బండారి స‌తీష్, కౌన్సిల‌ర్ మ‌హ‌బూబ్ , నాయ‌కులు లోక ప్ర‌వీణ్ రెడ్డి, శాంత‌న్ రావు , ఎంఏ ష‌కీల్, నిమ్మ‌ల గౌత‌మ్ రెడ్డి, పోతారెడ్డి , ప్ర‌భాక‌ర్, రాంరెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Latest