Mahaa Daily Exclusive

  ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు..

Share

విజయవాడ, మహా : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర రాజధాని ముంబైకి వెళ్లారు. అక్కడ కోకిలాబెన్‌ ధీరూభాయ్‌ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఆయన పరామర్శించారు. శనివారం డాక్టర్లు పవన్ కల్యాణ్ కుడి భుజానికి సర్జరీ చేయడం తెలిసిందే. సర్జరీ అనంతరం అక్కడే డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న పవన్ కళ్యాణ్‌ను ముంబైలోని ఆసుపత్రికి వెళ్లి మరీ చంద్రబాబు నేరుగా కలిసి, డిప్యూటీ సీఎం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తనకు ఎంతో ఆప్తుడైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.

 

ప్రముఖ ఆర్థోపెడిక్‌ సర్జన్, స్పోర్ట్స్‌ మెడిసిన్‌ నిపుణులు డాక్టర్‌ దిన్షా పార్థీవాలా నేతృత్వంలోని డాక్టర్ల టీమ్ పవన్ కళ్యాణ్ కుడి భుజానికి విజయవంతంగా సర్జరీ పూర్తి చేసింది. పవన్ కళ్యాణ్ గత కొన్ని నెలలనుంచి రొటేటర్‌ కఫ్‌ గాయంతో పాటు భుజానికి అవల్షన్‌ ఫ్రాక్చర్‌ తో ఇబ్బంది పడుతున్నందున ఈ ఆపరేషన్ తప్పనిసరి అయింది. అయితే, ఎడమ భుజానికి కూడా సర్జరీ చేయాల్సి ఉంది. మొదట కుడి చేతికి శస్త్రచికిత్స చేసినట్లు డాక్టర్లు ఇదివరకే వెల్లడించారు.