- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కీలకమంత్రులు హాజరు
- నేడు కాళోజీ కళాక్షేత్రం ప్రారంభం
- 22 జిల్లాల్లో ఇందిరా మహిళాశక్తి భవనాలు
హైదరాబాద్, మహా
అధికారంలోకి వచ్చిన ఏడాది సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంబరాలకు సిద్ధమైంది. ప్రజాపాలన ప్రజా విజయోత్సవం పేరుతో మంగళవారం ఓరుగల్లు వేదిక భారీ సభ నిర్వహిస్తోంది. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా శాఖల వారీగా నివేదికలు ఇచ్చేందుకు ప్రభుత్వ శాఖలు సిద్ధమయ్యాయి. ఈ 12 నెలల్లో ఏం జరిగిందో ప్రజలకు పూర్తిస్థాయిలో వివరించబోతున్నారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుడతారు. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించే బహిరంగ సభలో మాట్లాడుతారు. స్వయం సహాయ బృందాల మహిళలతో సమావేశమై ఆ గ్రూపులకు సంబంధించిన ఆస్తుల పంపిణీ చేస్తారు. వరంగల్, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఈ సభల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అలాగే డిసెంబరు 9న సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మహిళల సాధికారత, రైతుల సంక్షేమం, యూత్ ఎంపవర్‌మెంట్‌కు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చిన నేపథ్యంలో వాటిపై వివిధ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్, సచివాలయం, నెక్లెస్‌రోడ్ పరిసరాల్లో విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.
సక్సెస్ మంత్ర
– 50వేలకు పైగా ఉద్యోగ నియామకాలు
– 2లక్షల రుణమాఫీ
– మహిళలకు ఫ్రీ బస్
– సన్నవడ్లకు బోనస్
– జాబ్ క్యాలెండర్.. పరీక్షల నిర్వహణ
ఎన్నో సంచలనాలు
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాదికాలంలోనే అనేకరంగాల్లో తనదైన మార్కు వేసుకుంది. ఉద్యోగాల కల్పనలో తిరుగులేని రికార్డు సొంతం చేసుకుంది. ఏడాది వ్యవధిలో 50వేలకు పైగా ఉద్యోగ నియామకాల పత్రాలు ఇవ్వడం దేశంలోనే రికార్డు. పోటీ పరీక్షల నిర్వహణలో, నియామకాల్లో ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాలకంటే భిన్నమైనదని రుజువైంది. రుణమాఫీ సాహసం చేసింది. ఏకకాలంలో 18వేల కోట్లకు పైగా మాఫీ చేయడం ఏ రాష్ట్ర ప్రభుత్వం సాహసించనిది. కానీ రేవంత్ సర్కార్ ఈ పని చేసింది. మహిళలకు ఉచిత బస్సు, 500కే గ్యాస్, 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్ వంటి పథకాలన్నీ అమలవుతున్నాయి. పెట్టుడుల ఆకర్షణలో పాత ఒరవడి కొనసాగుతుండగా, రైతులకు సన్నవడ్లకు బోనస్ ప్రకటించింది.
నాలుగు ప్రణాళికలు
తెలంగాణ అభివృద్ధి గురించి సీఎం రేవంత్ పూర్తి విజన్ తో ఉన్నారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఏ కార్యక్రమంలో పాల్గొన్నా తాము పెట్టుకున్న లక్ష్యాలు తీసుకుంటున్న చర్యల గురించి వివరిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో ఓ కాంక్లేవ్ లో పాల్గొన్న సీఎం… నాలుగు భవిష్యత్ లక్ష్యాల గురించి చెప్పారు. అందులో ఒకటి ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్, మూసీ పునరుజ్జీవం, రేడియల్ రోడ్స్ వంటివి పూర్తి చేసి తీరుతామన్నారు. ఈ నాలుగు ప్రణాళికలు తెలంగాణ భవిష్యత్తును మార్చబోతున్నాయి.
……..
ఇదీ షెడ్యూల్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల వేడుకలలో వరంగల్ జిల్లా కేంద్రంగా పాల్గొననున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ ను ఈ మేరకు ఖరారు చేశారు. మంగళవారం వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన 2.30కు కూడా గ్రౌండ్స్ హెలిపాడ్ ప్రాంతానికి చేరుకోవడంతో ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి 2 గంటల 30 నిమిషాల నుంచి మూడు గంటల 10 నిమిషాల వరకు కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభిస్తారు. ఆపై అక్కడ ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీని సందర్శిస్తారు. తర్వాత ఆర్ట్స్ కళాశాలకు రోడ్డు మార్గంలో వెళతారు. 22 జిల్లాలలో ఇందిర మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ట్రాన్స్ జెండర్ క్లినిక్ లను ప్రారంభిస్తారు. వీటితోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారు. అనంతరం నాలుగు నెలల నుండి 4 గంటల 40 నిమిషాల వరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతారు. 4 గంటల 40 నిమిషాల నుండి 5 గంటల వరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు.








