Mahaa Daily Exclusive

  ఖరీఫ్ పంటల బీమా బకాయిలకు గ్రీన్‌సిగ్నల్.

Share

  •  రైతుల ఖాతాల్లో త్వరలో నగదు జమ.

అమరావతి, మహా.

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు జరిపిన చర్చలు ఫలించాయి. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న 2024 ఖరీఫ్ పంటల బీమా బకాయిల విడుదలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో బీమా పరిహారానికి అర్హులైన రైతుల ఖాతాల్లో త్వరలోనే నగదు జమ కానుంది.

ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. గత ప్రభుత్వ వైఫల్యాల కారణంగా వ్యవసాయ శాఖలో పేరుకుపోయిన సమస్యలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరిస్తోందన్నారు.

రైతులకు అందాల్సిన పంటల బీమా ప్రయోజనాలు సకాలంలో చేరేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు చేపడుతోందని ఆయన పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పెండింగ్ బీమా బకాయిల విడుదలకు సహకరించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో పాటు కేంద్ర ప్రభుత్వానికి అచ్చెన్నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.

పంట నష్టాలను ఎదుర్కొన్న రైతులకు బీమా సొమ్ము త్వరగా అందేలా అవసరమైన ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని, బకాయిలు రైతుల ఖాతాల్లో త్వరలో జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.