Mahaa Daily Exclusive

  ఘనంగా కాంగ్రెస్ నాయకుడి జన్మదిన వేడుకలు

Share

  • శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొండా సురేఖ

వరంగల్, మహా;

వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని 25వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జన్ను శ్యామ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి .

జన్మదినం సందర్భంగా రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ను జన్ను శ్యామ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి జన్ను శ్యామ్‌ను శాలువాతో సన్మానించి, స్వీట్స్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపాల నవీన్ రాజ్ నివాసంలో వరంగల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాష్ లను వారిని మర్యాదపూర్వకంగా కలుసుకోగా అక్కడ జన్ను శ్యామ్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహిస్తూ కేక్ కట్ చేయించి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో 25వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్నేహితులు పాల్గొని జన్ను శ్యామ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.