Mahaa Daily Exclusive

  ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్…

Share

  • ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్
  • మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్, మహా : సహచర ట్రెనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కేసు నమోదు నేపథ్యంలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ వద్ద అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని హైదరాబాద్ తరలించారు. శంకరపల్లిలోని నేషనల్ పోలీస్ అకాడమీలో మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపుల కేసులో ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఈ కేసు దర్యాప్తును ఉమెన్స్ సేఫ్టీ వింగ్‌కు నగర పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ బదిలీ చేశారు.