- సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పై మసూద్ ఫైర్
- వైఎస్ఆర్ పాలనలోనే నదీ జలాల పంపిణీలో అన్యాయం
- కేంద్ర మంత్రికి లెటర్ లో ఏం రాశారో సీఎం చెప్పాలి
- వరంగల్ బిఆర్ఎస్ సీనియర్ నేత మసూద్ సూటి ప్రశ్న
వరంగల్, మహా ;
కృష్ణానది జలాల విషయంలో గతంలో కాంగ్రెస్ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని వరంగల్ తూర్పు బిఆర్ఎస్ మైనార్టీ సీనియర్ నాయకులు మసూద్ ఘాటుగా విమర్శించారు.
కృష్ణా జలాల పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు వరంగల్ తూర్పు బిఆర్ఎస్ మైనార్టీ సీనియర్ నాయకులు మసూద్ దీటుగా సమాధానం చెప్పారు.
ఈ సందర్భంగా ఓ ప్రకటనలో మసూద్ మాట్లాడుతూ.. ఆనాటి ఉమ్మడి
ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నీటి పంపకాలు అలాగే కృష్ణానది జలాల విషయంలోనూ కాంగ్రెస్ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ను విమర్శిస్తున్నారు కానీ, అసలు అన్యాయం చేసింది కాంగ్రెస్సే.
ఆనాటి వైఎస్ఆర్ పాలనలో జలాల పంపిణీ విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. కృష్ణా నీటిని రాయలసీమకు తరలించడానికి పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచారు. తెలంగాణ రైతుల గొంతు కాడి నీళ్లు లాక్కుని ఆంధ్రాకు ఇచ్చారు. అదే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తెలంగాణకు న్యాయం చేస్తామని చెబుతోంది – ఇది నమ్మే విషయమా?”
ఆనాడు టిఆర్ఎస్ నేతలు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం గుర్తు చేశారు.
ఆనాడు 2005 వైఎస్ఆర్ కాలంలో నదీ జలాల పంపిణీలో ప్రత్యేక జీవో ను తీసుకువచ్చి తెలంగాణకు అన్యాయం జరిగిందని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు.
పదవులను కూడా లెక్క చేయకుండా, తెలంగాణ నీటి హక్కుల కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం రాజీనామాలు చేసిన చరిత్ర టిఆర్ఎస్ ది. కేసీఆర్ నాయకత్వంలోనే ఆనాడు ఉద్యమం ఉవ్వెత్తున లేచింది.
ఈ రోజు కాంగ్రెస్ నాయకులు ఏం చేశారు? తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే పదవులకు అతుక్కుని కూర్చున్నారు. ఇప్పుడు వచ్చి కేసీఆర్ ని అంటే ఎలా?”
సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రికి లెటర్ రాశానంటాడు – అందులో ఏం రాశారో చెప్పలేదు:
“సీఎం రేవంత్ రెడ్డి – కేంద్ర జలశక్తి మంత్రికి జలాల పంపిణీ విషయంలో లెటర్ రాశాను అంటున్నారు. బాగుంది, కానీ అందులో ఏం రాశారో విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఇప్పటివరకు సమాధానం చెప్పలేదు. లెటర్ లో ఏం రాశారు? తెలంగాణకు ఎన్ని టీఎంసీ లు కావాలని అడిగారు? పోతిరెడ్డిపాడు ను ఆపాలని అడిగారా? పల్నాడు వాటర్ గ్రిడ్ ను ఆపాలని అడిగారా? ఏదీ చెప్పడం లేదు.
లెటర్ రాశానని చెప్పి, ఆ లెటర్ ను బయటపెట్టకుండా దాచిపెడితే, ప్రజలు ఏం నమ్మాలి? ముందు ఆ లెటర్ ను బయటపెట్టండి. అందులో ఏం రాశారో తెలంగాణ ప్రజలకు చెప్పండి. ఆ తర్వాత కేసీఆర్ గురించి మాట్లాడండి” అని మసూద్ ఘాటుగా ప్రశ్నించారు.
కాంగ్రెస్ గతంలో తెలంగాణకు అన్యాయం చేసింది, ఇప్పుడు కూడా అదే చేస్తోంది. తెలంగాణ నీటి హక్కులను కాపాడగలిగింది ఒక్క కేసీఆర్ ఏ , ఒక్క బిఆర్ఎస్ పార్టీయే. మైనార్టీల తో సహా తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్ వెంటే ఉన్నారని మసూద్ పేర్కొన్నారు.








