Mahaa Daily Exclusive

  ఒకేసారి ఐదు ఉద్యోగాలు సాధించిన యువకుడికి సన్మానం ..

Share

  • ఒకేసారి ఐదు ఉద్యోగాలు సాధించిన యువకుడికి సన్మానం
  • యువత అంజన్ కుమార్ ని ఆదర్శంగా తీసుకోవాలి
  • కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొంగర విష్ణువర్ధన్ రెడ్డి

 

ఇబ్రహీంపట్నం జూలై 28 మహా:

ఒకేసారి ఐదు ఉద్యోగాలు సాధించిన ఆరుట్ల గ్రామస్తుడు చిందం అంజన్ కుమార్ ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొంగర విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన చిందం సుగుణమ్మ కృష్ణయ్యల కుమారుడు అంజన్ కుమార్ ఒకేసారి ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించగా మంగళవారం వారం రోజున కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొంగర విష్ణువర్ధన్ రెడ్డి ఆ యువకుడిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… నిరుపేద కుటుంబంలో జన్మించిన అంజన్ కుమార్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని తెలంగాణ గ్రామీణ బ్యాంకు క్లర్క్, హైకోర్టు ఫీల్డ్ అసిస్టెంట్, రెండు రైల్వే ఎన్టిపిసి ఉద్యోగాలు, టీజిఎస్ ఆర్టిసి సూపరిండెంట్ ఇలా ఒకేసారి ఐదు ప్రభుత్వ కొలువులు సాధించడం గర్వకారణం అని అన్నారు నేటి యువత అంజన్ కుమార్ ని ఆదర్శంగా తీసుకొని జీవితంలో ఎదగాలని అన్నారు చెడు వ్యసనాల బారిన పడకుండా సన్మార్గంలో నడుస్తూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆదిశగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడిమల్ల చంద్రయ్య మార సురేష్ వస్పరి కుమార్ ఎండి అశ్రఫ్ కోరె పాండు తదితరులు పాల్గొన్నారు.