Mahaa Daily Exclusive

  డా. శాఖమూరి శ్రీనివాస ప్రసాద్‌కు ‘రతన్ టాటా విజనరీ ఐకాన్’ అవార్డు.

Share

‘సీబీఎన్ @ 361 డిగ్రీస్ – ది పాలిమత్’ పుస్తకానికి దక్కిన అరుదైన గౌరవం.

హైదరాబాద్, మహా.

ప్రముఖ రచయిత, మేధావి డాక్టర్ శాఖమూరి శ్రీనివాస ప్రసాద్‌ను ప్రతిష్టాత్మక ‘రతన్ టాటా విజనరీ ఐకాన్ అవార్డు – 2026’ (గ్లోబల్ విజనరీ హానర్) వరించింది. ఆయన రచించిన ‘సీబీఎన్ @ 361 డిగ్రీస్ – ది పాలిమత్’ అనే అద్భుతమైన పుస్తకానికి గాను, సాహిత్యం , పరిశోధన రంగాల్లో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా జివ్రాన్ ఫౌండేషన్ ఈ అరుదైన పురస్కారాన్ని ప్రకటించింది.

నాయకత్వం, సుపరిపాలన, ఆవిష్కరణలు, సాంకేతికత, సుస్థిర అభివృద్ధి, దేశ నిర్మాణం తదితర అంశాలపై దార్శనిక ఆలోచనలతో, బహుముఖ జ్ఞానంతో డాక్టర్ శ్రీనివాస ప్రసాద్ చేసిన లోతైన విశ్లేషణకు ఈ అవార్డు దక్కింది. ఈ పుస్తకం ద్వారా పాఠకులకు ప్రగతిశీల ఆలోచనలను, సమగ్ర దృక్పథాన్ని అందించారని అవార్డు ప్రశంసాపత్రంలో ప్రదాతలు ప్రత్యేకంగా ప్రస్తావించారు. విద్యా, పరిశోధన, దార్శనిక నాయకత్వం ద్వారా వర్తమాన, భవిష్యత్ తరాలకు ఆయన అందిస్తున్న మేధోపరమైన సాధికారతను ఈ సందర్భంగా కొనియాడారు.

భారత ప్రభుత్వ నీతి ఆయోగ్ (ఎన్‌జీఓ దర్పణ్), ఎంఎస్‌ఎంఈ వద్ద నమోదైన జివ్రాన్ ఫౌండేషన్ గత నెల జులై 29 తేదీన ఈ పురస్కారాన్ని ఖరారు చేసింది. ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఈఆర్. ఆకాష్ సాహు, మేనేజింగ్ డైరెక్టర్ అశుతోష్ సింగ్ సంతకాలతో కూడిన ఈ ప్రశంసాపత్రాన్ని డాక్టర్ ప్రసాద్‌కు అందజేశారు. సాహిత్యం, మేధోపరమైన రంగాల ద్వారా సమాజానికి ఆయన అందిస్తున్న సేవలు భవిష్యత్తులోనూ విజయవంతంగా కొనసాగాలని వారు ఆకాంక్షించారు.