Mahaa Daily Exclusive

  కారేపల్లి మండలంలో పలు మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే….

Share

కారేపల్లి, మహ:

సింగరేణి మండలంలో వివిధ గ్రామాలలో మృతి చెందిన మృతుల కుటుంబాలను వైరా శాసనసభ్యులు మాలోత్ రామదాసు నాయక్ ఆదివారం పరామర్శించారు. గుంపెళ్ళగూడెం గ్రామంలో ఇటీవల మృతి చెందిన ఎర్రబల్లి పెద్ద లక్ష్మయ్య కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అలాగే బజ్జ తండాలో గుండెపోటుతో మరణించిన అజ్మీర లక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అక్కడనుండి విశ్వనాథపల్లి గ్రామంలో విద్యుత్ షాక్ తో మృతి చెందిన మహిళా రైతు వడ్డే ఉమా కుటుంబ సభ్యులను ఓదార్చి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోటకూరి పిచ్చయ్య ను ప్రత్యేకంగా కలిసి కొంతసేపు చర్చలు జరిపారు. ఎమ్మెల్యే వెంట మండల పార్టీ అధ్యక్షులు తోటకూరి రాంబాబు,సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ రామ్మూర్తి నాయక్, పెద్దబోయిన ఉమాశంకర్, అడ్డగోడ ఐలయ్య, భీముడు నాయక్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు భూక్య రంజిత్ కుమార్ , వివిధ గ్రామ పంచాయతీల సర్పంచులు,మండల పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.