- కుటుంబం గడపటం కష్టంగా ఉంది….
కారేపల్లి, మహ:
మండల పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లకు గత ఐదు నెలలుగా వేతనాలు రావడం లేదని, దీంతో కుటుంబం గడపడమే చాలా కష్టంగా ఉందని ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ శాఖలలో పని చేసే అధికారులకు నెలసరి వేతనాలు ఇచ్చే విధంగానే , కంప్యూటర్ ఆపరేటర్లు కూడా నెలవారి వేతనాలను ఇచ్చి తమ కుటుంబాలను ఆదుకోవాలని, ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కుటుంబాన్ని గడపడానికి అనేక ప్రాంతాలలో అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొని ఉందని, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకొని కంప్యూటర్ ఆపరేటర్ల ఆవేదనను అర్థం చేసుకొని నెలసరిగా వేతనాలను మంజూరు చేయాలని వారు కోరుతున్నారు.
Post Views: 43








