Mahaa Daily Exclusive

  చేనేత పారిశ్రామిక నూతన కార్యవర్గానికి ఘన సన్మానం

Share

పరకాల, మహా;

పరకాల నియోజక వర్గంలోని పరకాల రూరల్ మండలం నాగారం గ్రామ చేనేత పారిశ్రామిక సహకార సంఘానికి నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పరకాల నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్. పగడాల కాళీ ప్రసాద్ రావు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

నూతనంగా ఎన్నికైన చైర్మన్ దాసరి బిక్షపతి ,వైస్ చైర్మన్ మోతె రఘుపతి, కోశాధికారి గాజర్ల రాజేందర్, డైరెక్టర్లు కాంబత్తుల సాంబయ్య, సామల మహేందర్, మంత్రి మహేశ్వరి, మెండు రాజేందర్, వావిలాల రాజస్మయ్య, మార్కండేయ గుడి ఛైర్మెన్ మోతె కోటిలింగం, పద్మశాలి కుల పెద్ద మనిషి మెండు కృష్ణమూర్తి లను శాలువాలతో సన్మానించి, వారి పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా డా. పగడాల కాళీ ప్రసాద్ రావు మాట్లాడుతూ, చేనేత రంగం అభివృద్ధికి సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, చేనేత కార్మికుల సంక్షేమం కోసం నూతన కార్యవర్గం కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పరకాల మండల అధ్యక్షులు కాసాగాని రాజ్ కుమార్ గౌడ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ బాబు యాదవ్, నాయకులు దండ్రే దేవేందర్, క్రాంతి యాదవ్, గొట్టే మొగిలి, రాజు, వి. మొగిలి, రవి,బూత్ అధ్యక్షులు బిక్షపతి, సీహెచ్. మహేందర్ రెడ్డి, ఏ. సురేష్, పి. రాంబాబు, ఎల్లా స్వామి తదితరులు పాల్గొన్నారు.