వరంగల్, మహా ;
తెలంగాణ మహిళా సంఘాలకు ప్రభుత్వం పంపిణీ చేయనున్న చీరల ఉత్పత్తి వేగంగా కొనసాగుతోంది. మే నెలలో 4.62 కోట్ల మీటర్ల ఉత్పత్తికి ఆర్డర్లు ఇవ్వగా, ఇప్పటివరకు 1.74 కోట్ల మీటర్ల వస్త్రం ఉత్పత్తి పూర్తయింది. ఈసారి నీలం రంగుకు బదులుగా చిలకపచ్చ రంగు చీరలను పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం రూ.450 కోట్లు కేటాయించగా, రూ.142 కోట్లకు పరిపాలన అనుమతులు ఇచ్చింది. సెప్టెంబరు 20లోగా ఉత్పత్తి పూర్తి చేసి అక్టోబరులో పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఉత్పత్తి ద్వారా రాజన్న సిరిసిల్ల పవర్‌లూమ్, మ్యాక్స్ సంఘాలకు పని లభించడంతో నేతన్నల్లో ఆశలు పెరిగాయి.
Post Views: 8







