Mahaa Daily Exclusive

  వరంగల్‌ లో వైభవంగా థానా కాన్–2026 రాష్ట్ర మహాసభ..

Share

  • వరంగల్‌ లో వైభవంగా థానా కాన్–2026 రాష్ట్ర మహాసభ
  • రాష్ట్రవ్యాప్తంగా పాల్గొన్న వైద్యులు, ఆసుపత్రుల ప్రతినిధులు
  • ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు

వరంగల్, హెల్త్ మహా;

తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ థానా ఆధ్వర్యంలో 11వ వార్షిక రాష్ట్ర మహాసభ థానాకాన్–2026” వరంగల్ అరేపల్లిలోని వజ్ర గార్డెన్స్‌ లో ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వైద్యులు, చిన్న, మధ్యతరహా మరియు పెద్ద ఆసుపత్రుల యాజమాన్య ప్రతినిధులు ఈ మహాసభకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వైద్య రంగానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలపై నిపుణులతో శాస్త్రీయ చర్చలు, నిరంతర వైద్య విద్యా కార్యక్రమాలు (CME), అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వైద్య రంగంలోని ముఖ్య అంశాల పై కూలంకషంగా చర్చించారు.
మహాసభలో భాగంగా నిర్వహించిన శాస్త్రియ సదస్సులో లో అగ్ని ప్రమాదాల భద్రత, ఐసీయూ ప్రోటోకాల్స్, రోగుల భద్రత, వైద్య నైతిక విలువలు–వైద్య ఆచరణలో వాటి ప్రాధాన్యత, ఆరోగ్య బీమా పథకాలు, కొత్త ఆసుపత్రుల ఆర్థిక నిర్వహణ తదితర అంశాలపై నిపుణులు వైద్యులకు అవగాహన కల్పించారు.
అలాగే ఆసుపత్రి నిర్వహణ, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్, ప్రభుత్వ ఆరోగ్య పథకాలు, టిపీఎ లు, డిజిటల్ హెల్త్‌కేర్, మెడికల్ ఎథిక్స్ తదితర అంశాలపై కూడా చర్చలు నిర్వహించారు.
వైద్య సేవల్లో నాణ్యతను పెంచడం, రోగుల భద్రతను మెరుగుపరచడం, ఆసుపత్రుల నిర్వహణలో ఎదురవుతున్న ఆచరణాత్మక సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

*డా. పి. ప్రవీణ్ థానా రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం*

ఈ సందర్భంగా థానా రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా డా. పి. ప్రవీణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
చిన్న, మధ్యతరహా ఆసుపత్రులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, ఆసుపత్రుల ప్రయోజనాలను పరిరక్షిస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని డా. పి. ప్రవీణ్ తెలిపారు.

ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు

ఈ రాష్ట్ర మహాసభకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మరియు వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ, చిన్న, మధ్యతరహా ఆసుపత్రులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, డా. పి. ప్రవీణ్ థానా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం వరంగల్ జిల్లాకు గర్వకారణమని అన్నారు. వైద్యులు, ఆసుపత్రులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో తన సహకారం అందిస్తానని తెలిపారు.

ఆరోగ్య రంగ సమస్యలపై ప్రత్యేక ప్యానల్ చర్చ

థానాకాన్–2026లో నిర్వహించిన ప్రత్యేక ప్యానల్ చర్చలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆరోగ్య రంగాలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై సవివరంగా చర్చించారు.

ముఖ్యంగా చిన్న మరియు మధ్యతరహా ఆసుపత్రుల మనుగడ, పెరుగుతున్న నియంత్రణ నిబంధనలు, ప్రభుత్వ ఆరోగ్య పథకాలు, ఆరోగ్య బీమా, వైద్యుల భద్రత, నకిలీ వైద్యుల సమస్య, వైద్య విద్య, ఆసుపత్రుల నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు.

ఈ చర్చ అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి క్రింది ముఖ్య సూచనలు, విజ్ఞప్తులను సమర్పించాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా
ప్రభుత్వానికి ముఖ్య సూచనలు, విజ్ఞప్తులు చేశారు.
ముఖ్యంగా చిన్న మధ్యతరహా ప్రైవేట్ ఆసుపత్రులు తెలంగాణ ఆరోగ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నందున, వాటిని సూక్ష్మ, చిన్న మధ్యతరహా ఆరోగ్య సంస్థలుగా గుర్తించి తగిన ఆర్థిక సహాయం, మౌలిక సదుపాయాలు, నియంత్రణ పరమైన ప్రోత్సాహకాలు అందించాలి. అంతేకాకుండా
మారుమూల ప్రాంతాల్లో వైద్యులు ఆసుపత్రులు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందించేలా ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహక పథకాలు రూపొందించాలని సమావేశం కోరింది.
ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ వైద్య రంగాన్ని భాగస్వామిగా చేసుకుని చిన్న ఆసుపత్రులను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత బలోపేతం చేయవచ్చని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో
ప్రముఖ వైద్యులు
థానాకాన్–2026 రాష్ట్ర మహాసభను ఆర్గనైజింగ్ చైర్మన్ డా. పి. ప్రవీణ్, ఆర్గనైజింగ్ కో-చైర్మన్ డా. ముక్కా దిలీప్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. ఎల్. నాగేశ్వర్ రావు, ఆర్గనైజింగ్ ట్రెజరర్ డా. వి. నరేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించగా థానా మహాసభలకు వరంగల్ సలహాదారులుగా
డాక్టర్ పి కాళీ ప్రసాదరావు,
డా. టి. నర్సింగ రెడ్డి,
డా. కె. అశోక్ రెడ్డి,
డా. వి. రాకేష్,
డా. నరసింహరావు,
డా. పి. విజయ చంద్ర రెడ్డి,
డా. కస్తూరి ప్రమీల,
డా. ఎం. శేషు మాధవ్,
డా. విద్యాసాగర్,
డా. దశరథం,
డా. జి. రమేష్,
డా. ఎం. సుదీప్,
డా. పి. సుధీర్ కుమార్,
డా. కొత్తగట్టు శ్రీనివాస్,
డా. పి. ప్రవీణ్ రెడ్డి తో పాటు రాష్ట్ర అధ్యక్షులు డా. అరుణ్ కటారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఎం.వి. ప్రసాద్,
రాష్ట్ర కోశాధికారి డా. కె. అశోక్ కుమార్, రాష్ట్ర తక్షణ పూర్వ అధ్యక్షులు
డా. ఎల్. సురేష్ గౌడ్,
రాష్ట్ర జాయింట్ సెక్రటరీ డా. ఎస్. నౌనిహాల్ సింగ్,
జోన్–1 రాష్ట్ర ఉపాధ్యక్షులు
డా. వి. అశోక్,
జోన్–2 రాష్ట్ర ఉపాధ్యక్షులు
డా. ఎన్. మహేష్ బాబు,
జోన్–3 రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. గుండేటి రమేష్ తదితర ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు.
ఈ రాష్ట్ర మహాసభ వైద్యులు, ఆసుపత్రుల యాజమాన్యాలు, వైద్య రంగ నిపుణుల మధ్య సమన్వయం, జ్ఞాన మార్పిడి తో పాటు తెలంగాణలో నాణ్యమైన ఆరోగ్య సేవల అభివృద్ధికి ఒక ముఖ్యమైన వేదికగా నిలిచింది.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన వైద్యులు, ఆసుపత్రుల యాజమాన్యాలు, నిర్వాహకులు, ప్రతినిధులకు థానా వరంగల్ కృతజ్ఞతలు తెలిపింది.