సికింద్రాబాద్, మహా.
రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో ఇద్దరు యువకులు కారుతో ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని ప్రియాంక ఆదివారం మృతిచెందారు. మూడు రోజులుగా సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు. ఈ మేరకు కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ప్రకటన విడుదల చేశారు.
రాజమహేంద్రవరంలో జరిగిన ఘటనలో ప్రియాంక తీవ్రంగా గాయపడటంతో మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ కిమ్స్‌కు తరలించారు. అప్పటి నుంచి మూడు రోజులుగా వైద్యులు ఆమెకు అత్యవసర చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఆమె బ్రెయిన్‌డెడ్‌గా మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని కిమ్స్ ఆస్పత్రిలోనే భద్రపరిచారు.
ప్రియాంక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు రాజమహేంద్రవరం పోలీసులు సికింద్రాబాద్‌కు రానున్నారు. ఆమె తండ్రి వెంకటేశ్ ప్రస్తుతం రాజమహేంద్రవరంలో ఉన్నట్లు సమాచారం. ఆయన వచ్చిన అనంతరం పోలీసుల సమక్షంలో మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించే అవకాశం ఉంది.
మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు కారుతో ప్రియాంకను ఢీకొట్టిన ఘటనపై రాజమహేంద్రవరం పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్న పోలీసులు.. నిందితులపై కఠిన చర్యలు తీసుకునే దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ప్రియాంక మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఎంతో భవిష్యత్తు ఉన్న వైద్య విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం పలువురిని కలచివేసింది.







