కారేపల్లి, మహ : కేంద్రప్రభుత్వ కార్మిక, కర్షక రైతు విధానాలపై నిరసిస్తూ సోమవారం దేశవ్యాప్తంగానిర్వహించిన జైలు భరో కార్యక్రమం కారేపల్లిలో విజయవంతమైంది. సీపీఐ(ఎం) ప్రజాసంఘాల ఆధ్వర్యంలో వివిధ రంగాల కార్మికులు కారేపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సెంటర్ లో రాస్తారోకో, మానహారం చేపట్టారు. రాస్తారోకోతో వాహనాలు నిలిచిపోయాయి. కారేపల్లి ఎస్సై బైరు గోపీ ఆధ్వర్యంలో పోలీసులు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొండబోయిన నాగేశ్వరరావు ను అదుపులోకి తీసుకోని పోలీసు వాహనంలో స్టేషన్ కు తరలిస్తుండగా కార్మికులు వాహనానికి అడ్డుపడ్డారు. దీంతో కొద్ది సేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. వ్యకాస నేతను స్టేషన్ కు తరలించిన అనంతర మిగితానాయకులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ సైతం కార్మిక సంఘంనేతలునిరసన కార్యక్రమాన్ని సాగించారు. ఈసందర్భంగా వ్యకాస నేత కొండబోయిన నాగేశ్వరరావు, సీఐటీయు మండల కన్వీనర్ కే.నరేంద్ర లు మాట్లాడతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పేదలు, కార్మికులు, రైతులపై కక్ష పూరితంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. పేదలకు పని కల్పించే ఉపాధి హామీ గ్యారెంటీ చట్టాన్ని కొనసాగించాలని ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించే రేషన్ షాపులను నిర్విర్యం చేసి.నిరుపేదలకు 35 కేజీలబియ్యం అందజేసే ఏఏవై కార్దులకు బియ్యం కుదించిందన్నారు ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందన్నారు. కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్ లతో కార్మికుల శ్రమను దోచుకోవటానికి కార్పొరేట్ సంస్ధలకు హక్కు కల్పించారన్నారను. ఇక 12 గంటల పనివిధానం రానుందన్నారు పని భారం తగ్గించి కనీస వేతన చట్టం అమలు చేయాలని.వ్యవసాయ చట్టాలు, విద్యుత్ చట్టాలను తీసుకవస్తుందని దీంతో వ్యవసాయ రంగంలో చిన్న సన్నకారు రైతులపరిస్ధితి ప్రశ్నార్ధకంగా మారనుందన్నారు. బీజేపీ ప్రభుత్వ విధానాలపై ప్రజల నిరసన జైల్ భరోతో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఈకార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు ముండ్ల ఏకాంబరం, వజ్జా రామారావు, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు కేశగాని ఉపేందర్, యనమనగండ్ల రవి, పాసిని నాగేశ్వరరావు, ఐద్వా మండల అధ్యక్ష కార్యదర్శులు సురభాక ధనమ్మ, కొండబోయిన ఉమావతి, సీఐటీయు ముక్క సీతారాములు, అజ్మీర శోభన్, సోమందుల నాగమణి, ఎల్లబోయిన రాధ, గుర్రం వెంకటేశ్వర్లు, కేలోత్ రవి, శనగ రాంబాబు, ఆదెర్ల వినయ్, రేగళ్ల మంగయ్య, కరపటి సీతారాములు, కొండల్‌రావు, ఇస్మాయిల్, కళ్యాణి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.







