- ఎఫ్ బీ ఓ మృతి కేసు ఫస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ
- ఎఫ్బీవో కుటుంబాన్ని పరామర్శించిన ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సంజయ్ కుమార్
- -ఎఫ్ బీ వో కుటుంబాన్ని అన్న విధాల ఆదుకుంటాం
కారేపల్లి, మహ : ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోతు నవీన్ మృతి కేసును ఫస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించి దోషులకు శిక్ష పడేలా చేస్తామని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వినయ్ కుమార్ అన్నారు. సోమవారం కారేపల్లి మండలం వెంకిట్యాతండాలో ఎఫ్బీవో నవీన్ కుటుంబాన్ని పీసీసీఎఫ్ వినయ్ కుమార్, సీపీఎఫ్ భీమా నాయక్ లు పరామర్శించారు. నవీన్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన వారు నవీన్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎఫ్బీవో నవీన్ కుటుంబానికి అటవీశాఖ నిరంతరం అండగా ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా పీసీసీఎఫ్ సంజయ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ ఎఫ్బీవో నవీన్ మృతి కలచి వేసిందని, ఒక బాధ్యత గల సిన్సియర్ అధికారిని కోల్పోవడం విచారకరమన్నారు. విద్యుద్ఘాతం జరిగిన సమయంలో కరెంటు ట్రిప్ అవుతుందని, ఆ సమయంలో ఆ ప్రాంత సబ్ స్టేషన్ నుండి విద్యుత్ సరఫరా నిలువేసి, లైన్ క్లియర్ చేసిన తర్వాతనే సరఫరా పునరుద్దించడం చేయాల్సి ఉంటుందన్నారు. దానిలో కొంత నిర్లక్ష్యం జరిగిందని, ఈ విషయాన్ని విద్యుత్ సిఎండి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన తెలిపారు ఫారెస్ట్ అధికారులకు ఆయుధాల ఇవ్వటం పై ప్రభుత్వానికి ఆర్జీ పెడతామన్నారు. నవీన్ కుటుంబానికి శాఖ పరంగా అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు కుటుంబానికి ఉద్యోగం, పిల్లల విద్య, ఇంటి జాగా వంటి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈ సౌకర్యాల త్వరగా అందేలా చర్యలు తీసుకుంటావని హామీ ఇచ్చారు. వీరి వెంట డిఎఫ్వో అనూజ్ అగ్రవాల్, ఎఫ్డీవో భవాని శంకర్, ఇతర ఫారెస్ట్ అధికారులు ఉన్నారు.







