వరంగల్, మహా ;
వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25వ తేదీ భారీ ఎత్తున ‘మహా ధర్నా’ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షులు గంట రవికుమార్, కొలను సంతోష్ రెడ్డి తెలిపారు.
ఈ మహా ధర్నా కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించుకునేందుకు చట్టపరమైన అనుమతులు మంజూరు చేయాలని కోరుతూ, మంగళవారం వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత ను నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.
వీరితో పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రత్నం సతీష్ షా, జలగం రంజిత్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బన్న ప్రభాకర్, జిల్లా కార్యదర్శి పోనుగోటి వెంకట్ రావు, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 10








