Mahaa Daily Exclusive

  కలెక్టర్, బల్దియా కమిషనర్ ను కలిసిన హార్టికల్చర్ అధికారి…! బల్దియా ఉద్యానవన అధికారిగా ప్రశాంత్..

Share

వరంగల్, కార్పొరేషన్ మహా ;

బల్దియా హార్టికల్చర్ (ఉద్యానవన) అధికారిగా నూతనంగా నియమితులైన తిరునగరి ప్రశాంత్ జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి, గురువారం హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్ పాయ్ ను కలెక్టరేట్‌లో, బల్దియా కమిషనర్ టి. వెంకన్నను బాల సముద్రంలోని క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలను అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్, కమిషనర్ ప్రశాంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. నగరంలో పచ్చదనం పెంపు, పార్కుల అభివృద్ధి, మొక్కల సంరక్షణ, సుందరీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ప్రశాంత్ గతంలో వరంగల్ జిల్లా పర్వతగిరి మండల వ్యవసాయాధికారిగా విధులు నిర్వహించారు.