Mahaa Daily Exclusive

  కొడంగల్ లో సీఎం ఆత్మీయస్పర్శ

Share

  • అభిమానులు, స్ధానిక నేతల శుభాకాంక్షల వెల్లువ
  • సొంత నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి

(మహా నెట్ వర్క్ )

కొడంగల్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక ప్రజలు, నాయకులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. దసరా సందర్భంగా సొంత నియోజకవర్గ ప్రజలతో సీఎం మమేకమయ్యారు. కొడంగల్ ప్రజల అభిమానం… అభివృద్ధిలో రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తనకు రెట్టించిన ఉత్సాహాన్ని అందించిందని సీఎం సంతోషం వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో నియోజకవర్గ ప్రజలు తరలివచ్చి సీఎంకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. సీఎంను కలిసేందుకు, కరచాలనం చేసేందుకు, ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు.

ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా కొడంగల్‌లోని ప్రసిద్ధి చెందిన శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణ పనులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పరిశీలించారు. పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని అత్యంత వైభవంగా తీర్చిదిద్దే పనులు కొనసాగుతున్నాయి. ఆలయ పునర్నిర్మాణ పనులకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి బాలాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.