వరంగల్, బ్యూరో మహా ;
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద జిల్లా ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి (రక్షా బంధన్) పండుగ శుభాకాంక్షలు ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముడి అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి పండుగను జిల్లా ప్రజలందరూ ఆనందోత్సాహాలతోజరుపుకోవాలని సోదరీమణుల రక్షణకు అన్నదమ్ములు అండగా నిలవాలని ఆకాంక్షించారు. మహిళలను గౌరవించడం, వారి సంక్షేమానికి కృషి చేయడం మనందరి బాధ్యత అని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత కోసం అనేక పథకాలు అమలు చేస్తోందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మరోసారి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.








