Mahaa Daily Exclusive

  పల్లెల అభివృద్ధికి పెద్దపీట… మల్ రెడ్డి ….

Share

పల్లెల అభివృద్ధికి పెద్దపీట… మల్ రెడ్డి

 

🎇 మంచాల మండల అభివృద్ధికి అధిక నిధులు

🎇 మంచాల మండలంలో పండుగలా ప్రగతి కార్యక్రమాలు…

🎇 పేదల సంక్షేమమే ధ్యేయంగా సంక్షేమ పథకాలు…

🎇 పంచాయతీలకు ప్రాధాన్యతతో వికేంద్రీకృత పాలన…

🎇 ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి…

🎇 మంచాల మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం…

🎇 రాత్రి 8గంటల వరకు పల్లెల్లో పర్యటించిన మల్ రెడ్డి రంగారెడ్డి…

🎇 ఎల్లమ్మతాండలో వీరాంజనేయస్వామికి ప్రత్యేక పూజలు

 

ఇబ్రహీంపట్నం ఆగస్టు 29 మహా:

వెనకబడిన ప్రాంతం ముద్రను తొలగించేలా మంచాల మండలంలో పండుగలా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. నిధుల కేటాయింపులో పల్లెలకు పెద్దపీట వేస్తున్నట్లు ఆయన చెప్పారు. శనివారం మంచాల మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే… రూ.2.07కోట్లతో వివిధ గ్రామాల్లో సీసీ రోడ్లు, గ్రామపంచాయతీ నూతన భవనాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మధ్యాహ్నం వర్షంలో తడుస్తూనే లింగంపల్లి, తాళ్లపల్లిగూడ గ్రామాల్లో పర్యటించిన మల్ రెడ్డి… రాత్రి 8గంటల వరకు పల్లెల్ని చుట్టేశారు.

 

🔆 ముందుగా, లింగంపల్లి గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే… అక్కడ రూ.5లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అదే విధంగా, రూ.20లక్షలతో నిర్మించనున్న గ్రామపంచాయతీ నూతన భవనానికి ఆయన భూమిపూజ చేశారు. గ్రామంలో పర్యటన సందర్భంగా పలువురు మహిళలు ఎమ్మెల్యేను కలిసి, సమస్యలు విన్నవించారు. అంగన్‌వాడీ సబ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. గర్భిణులకు, చిన్నపిల్లలకు అందుతున్న వైద్యసేవల గురించి మల్ రెడ్డి ఆరాతీశారు. లింగంపల్లిగేటు వద్ద నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల సముదాయంలో సదుపాయాల గురించి లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత, తాళ్లపల్లిగూడలో పర్యటించిన మల్ రెడ్డి రంగారెడ్డి… అక్కడ రూ.25లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు.

 

🔆 తిప్పాయిగూడలో రూ.7లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించి, నూతనంగా నిర్మించతలపెట్టిన గ్రామపంచాయతీ భవనానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ చీర ధరించిన ఓ వృద్ధురాలిని కలిసి, సరదాగా ముచ్చటిస్తూ, పెన్షన్, చీరలు ఎలా వస్తున్నాయని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో డ్వాక్రాభవనం నిర్మాణం విషయపై మహిళలకు ఆయన హామీఇచ్చారు.

 

🔆 చిత్తాపూర్ లో నూతనంగా నిర్మించే గ్రామపంచాయతీ భవన నిర్మాణపనులకు మల్ రెడ్డి రంగారెడ్డి కొబ్బరికాయ కొట్టి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఓ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొని, లబ్ధిదారునికి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా, రూ.5లక్షలతో గ్రామంలో నిర్మించిన సీసీరోడ్డును ప్రారంభించారు.

 

🔆 జాపాల గ్రామంలో రూ.20లక్షలతో నూతనంగా నిర్మించే గ్రామపంచాయతీ భవనానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసుకున్న ఓ లబ్ధిదారుడు మల్ రెడ్డిని ఆహ్వానించగా, వారి కుటుంబసభ్యులతో కలిసి ఎమ్మెల్యే గృహప్రవేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు ఎమ్మెల్యేకు రాఖీకట్టి, ఆశీస్సులు తీసుకున్నారు.

 

🔆 అటు, కొర్రవానితండాలోనూ నూతన గ్రామపంచాయతీ పనులను మల్ రెడ్డి ప్రారంభించారు. రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో రంగాపూర్ లో పర్యటించిన ఎమ్మెల్యే… రూ.25లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డుకు ప్రారంభోత్సవం అనంతరం, మరో రూ.25లక్షలతో నిర్మించనున్న గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు.

 

🔱 వీరాంజనేయస్వామి విగ్రహప్రతిష్ఠ కార్యక్రమంలో మల్ రెడ్డి రంగారెడ్డి…

ఎల్లమ్మతండాలో శ్రీశ్రీశ్రీ మాందాపురం వీరాంజనేయస్వామి మరియు గణపతి, నాగదేవత విగ్రహప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. మూడ్రోజులుగా హోమాలు, పూజలతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా చివరి రోజు విగ్రహప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించగా… ఎమ్మెల్యే పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనను ఘనంగా సన్మానించి, తీర్థప్రసాదాలు అందజేశారు. గిరిజనుల జీవన విధానంలో ప్రకృతికి ఇచ్చే గౌరవం, అడవులతో ఉన్న అనుబంధం ఎంతో గొప్పదన్న మల్ రెడ్డి… యువత తమ మూలాలను, సంస్కృతిని మర్చిపోకుండా కాపాడుకోవాలన్నారు. ఇప్పటికే దేవాలయం వద్ద బోరు వేయించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన ఆలయ కమిటీ… ప్రహారీ గోడ నిర్మించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఐఎఫ్ఎస్సి చైర్మన్ కంబాలపల్లి గురునాథరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్లు పాండురంగ రెడ్డి, హనుమంత్ రెడ్డి, లింగంపల్లి గ్రామ సర్పంచ్ అమ్మనబోలు సంజీవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంగర విష్ణువర్ధన్ రెడ్డి, భూపతిగళ్ళ మహిపాల్, రమాకాంత్ రెడ్డి, భరత్ రెడ్డి, ఐలేష్, చీమల జంగయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Latest