Mahaa Daily Exclusive

  పురాతన శివాలయ అభివృద్ధికి బెల్ డీజీఎం శ్రీకారం..

Share

  • పురాతన శివాలయ అభివృద్ధికి బెల్ డీజీఎం శ్రీకారం
  • రూ.లక్షల విలువైన మండప నిర్మాణానికి హామీ.. 12 పిల్లర్లతో పునర్నిర్మాణం

 

కారేపల్లి,మహ:: కారేపల్లి మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న పురాతన శివాలయ అభివృద్ధికి ప్రముఖ బెల్ కంపెనీ డిప్యూటీ జనరల్ మేనేజర్ (డీజీఎం) గుగులోత్ రవి శ్రీకారం చుట్టారు. ఆలయంలోని గర్భగుడికి ఆనుకుని ఉన్న మండపం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు ఈ విషయాన్ని రవి దృష్టికి తీసుకెళ్లారు.దీంతో స్పందించిన రవి ఆదివారం ఆలయాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. మండప నిర్మాణానికి అవసరమైన 12 పిల్లర్లను నిర్మించి, మండపాన్ని పూర్తిస్థాయిలో పునర్నిర్మిస్తానని హామీ ఇచ్చారు. పురాతన ఆలయ పరిరక్షణకు తన వంతు సహకారం అందిస్తానని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు భీమవరపు శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ ఎర్ర నరసింహారావు, కమిటీ సభ్యుడు సూర్యదేవర వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు ఇమ్మడి తిరుపతిరావు, ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.