Mahaa Daily Exclusive

  ఎస్ఐఆర్ సెకండ్ ఫేజ్ చాలా కీల‌కం..! ఎస్ఐఆర్ ఫేజ్-2 కోర్ క‌మిటీ స‌మావేశంలో కంది శ్రీ‌నివాస రెడ్డి సూచ‌న‌లు..

Share

  • అర్హుల ఓట్లు కాపాడాలి
  • ఒక్క ఓట్ కూడా పోకుండా జాగ్ర‌త వ‌హించాలి
  • ఎస్ఐఆర్ ఫేజ్-2 కోర్ క‌మిటీ స‌మావేశంలో కంది శ్రీ‌నివాస రెడ్డి సూచ‌న‌లు

ఆదిలాబాద్ మ‌హా : ఎస్ఐఆర్ సెకండ్ ఫేజ్ లో అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత బీఎల్ ఏ-2 లు, సూపర్వైజర్లు, కోఆర్డినేటర్లు, కౌన్సిలర్ గా పోటీ చేసిన అభ్యర్థులు, మండ‌ల ,ప‌ట్ట‌ణ , వార్డ్ అధ్య‌క్షులు అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య నాయకుల పై ఉంద‌ని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని త‌న క్యాంపు కార్యాల‌యంలో నిర్వ‌హించిన ఎస్ఐఆర్ ఫేజ్-2 కోర్ క‌మిటీ స‌మావేశానికి ఆయ‌న హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా కంది శ్రీ‌నివాస రెడ్డి మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ రెండ‌వ ప్రక్రియలో 85వేల మందికి నోటీసులు అంద‌నున్నాయ‌న్నారు.అర్హత కలిగిన ఏ ఒక్కరి ఓటు కూడా పోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. బూత్ ల వారీగా నోటీసులు అందుకున్న వారి వివ‌రాలు సేక‌రించి త‌గిన ధృవ‌ప‌త్రాలు ఎన్నిక‌ల క‌మీష‌న్ కు స‌మ‌ర్పించి ఓటు కాపాడే ప్ర‌య‌త్నం చేయాల‌న్నారు. తాను ఎల్ల‌ప్పుడు అండ‌గా ఉంటాన‌న్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ ప‌ట్ట‌ణం లోని అనామ‌లిస్ ఓట్ల పై దృష్టి సారించాల‌ని సూచించారు. అర్హుల ఓట్లు ఎట్టి ప‌రిస్థితుల‌లో పోకుండా జాగ్ర‌త్త ప‌డాల‌న్నారు. ఎన్నిక‌లల‌లో డ‌బ్బే ప్ర‌ధానం కాద‌న్నారు. మ‌న మంచి మాట కూడా ప్ర‌భావం చూపుతుంద‌న్నారు. ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగ‌రేయ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేయాల‌న్నారు. బీజేపీ వాళ్ల‌కు ఎలా సమాధానం చెప్పాలో త‌న‌కు తెలుస‌న్నారు. కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నిర‌క్ష‌రాస్యుల‌కు నోటీసులొస్తే ద‌గ్గ‌రుండి ధృప‌పత్రాలు స‌మ‌ర్పించి ఓటు ర‌క్షించాల‌న్నారు.అలాగే డ్రాఫ్ట్ జాబితాలో అర్హుడిగా భావించిన వారి పేర్లు లేక‌పోతే తిరిగి న‌మోదుకు ప్ర‌య‌త్నించాల‌న్నారు. ముఖ్యంగా మైనారిటీలు,పేదలు, నిరక్ష‌రాస్యులు తమ ఓటు హక్కును కోల్పోకుండా పార్టీ శ్రేణులు బాధ్య‌త‌గా ప‌నిచేయాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ బండారి అనూష స‌తీష్ ,ఆత్మ క‌మిటీ చైర్మ‌న్ గిమ్ సంతోష్ రావు, మాజీ డీసీసీబీ చైర్మన్ ముడుపు దామోద‌ర్ రెడ్డి, జిల్లా మైనారిటీ సెల్ చైర్మ‌న్ షాహిద్ అలీ, లీగ‌ల్ సెల్ చైర్మ‌న్ మంగేష్, నాయ‌కులు గుడిపెల్లి నగేష్, మెహబూబ్ , సుధాకర్ గౌడ్, శాంతన్ రావు, అన్సార్, అడ్డి రుకేష్ రెడ్డి , రాందాస్ నాక్లే ,సోనియా మంథని, శ్రీలేఖ, జ్యోతి, షబానా ,బోనగిరి సంటెన్న, ఏనుగు రవీందర్ రెడ్డి, అల్చేట్టి నాగన్న, మండల అధ్యక్షులు వెంకన్న యాదవ్, బత్తుల శ్రీనివాస్, బాపూరావు, జగదీష్ రెడ్డి, రూప్ రావ్, సర్పంచ్లు వేణుగోపాల్, వామన్, దంతెల వినోద్ ఉప స‌ర్పంచ్ గౌతమ్ రెడ్డి, అతిక్ , రఫిక్, చంద్రకాంత్, శంకర్, పొట్ట అశోక్, ప్రభాకర్, ఆశన్న, చందు, షఖిల్, బండి సంజయ్, బండి సుదర్శన్ విశాల్, హాంజా, రాంరెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.