హైదరాబాద్, మహా : రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం గడువు పొడిగించింది. ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం.. సవరించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగించనున్నారు. గడువు పొడిగింపుతో ఓటర్ల జాబితాకు సంబంధించి ప్రజలు దాఖలు చేసే క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిశీలనకు మరింత సమయం లభించింది. ఈ ప్రక్రియను అక్టోబర్ 5వ తేదీ వరకు కొనసాగించనున్నట్లు అధికారులు తెలిపారు. అందిన అభ్యంతరాలు, క్లెయిమ్‌లను పూర్తిస్థాయిలో పరిశీలించిన అనంతరం అర్హులైన వారి వివరాలను తుది జాబితాలో పొందుపరచనున్నారు. పరిశీలన ప్రక్రియ పూర్తయిన తర్వాత అక్టోబర్ 9వ తేదీన తుది ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రచురించనున్నట్లు అధికారులు వెల్లడించారు. గడువు పొడిగింపుతో ఓటర్ల జాబితాలో తమ పేర్లు, వివరాలకు సంబంధించి అభ్యంతరాలు లేదా మార్పులు కోరుకునే వారికి అదనపు అవకాశం లభించినట్లయింది. ప్రజలు, రాజకీయ పార్టీల విజ్ఞప్తుల మేరకు ఎన్నికల సంఘం సవరించిన షెడ్యూల్‌ను ప్రకటించడంతో.. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ మరింత విస్తృతంగా కొనసాగనుంది. తుది జాబితా ప్రచురణ అనంతరం రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తికానుంది.








