Mahaa Daily Exclusive

  ఆత్మకూరులో ఘనంగా బతుకమ్మ సంబరాలు..

Share

*ఆత్మకూరులో ఘనంగా బతుకమ్మ సంబరాలు

*పాల్గొన్న హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి

 

ఆత్మకూరు,మహా ;

 

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ ఉత్సవాలు హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధలతో రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సాంప్రదాయక పాటలతో ఆడుతున్న ఉత్సవాల్లో ఆయన కాసేపు గడిపారు. అనంతరం గ్రామ ప్రజలందరికీ బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

 

ఈ సందర్భంగా ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ

తెలంగాణ అస్తిత్వానికి, ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ పండుగ ఒక నిదర్శనం అని ప్రకృతిని పూజించే ఇలాంటి గొప్ప పండుగను మనమంతా కలిసికట్టుగా జరుపుకోవడం సంతోషకరం. ఆత్మకూరు ప్రజల జీవితాల్లో ఈ బతుకమ్మ పండుగ సరికొత్త వెలుగులు నింపాలని, ప్రతి ఇల్లూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచి పర్వతగిరి మహేశ్వరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు