*కాంగ్రెస్ రాక్షస పాలన పై భగ్గుమన్న బిఆర్ ఎస్*
*హామీలు అమలు చేసేంతవరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదు*
*మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్*
వరంగల్, కాశిబుగ్గ మహా ;
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1000 రోజుల పూర్తైన ఇంతవరకు రేవంత్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతు నొక్కి బిఆర్ఎస్ పార్టీ నేతలను, నాయకులను అక్రమంగా అరెస్టులు చేసి రాక్షస పాలన కొనసాగిస్తున్నారని వరంగల్ తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో మంగళవారం బిఆర్ ఎస్ మాజీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తల తో కలిసి కాశిబుగ్గ చౌరస్తాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిఆర్ఎస్ పార్టీ మాజీ ప్రణాళిక సంఘం అధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ హాజరై కాంగ్రెస్ పార్టీ పై నిప్పులు చెరిగారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి, వెయ్యి రోజులు పూర్తయినా ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేక పోయింది.
ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తదనంతరం కాశీబుగ్గ చౌరస్తాలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, వినతిపత్రం సమర్పించడం జరిగింది.
*మాజీ మహిళా మంత్రుల పై దాడి సిగ్గుచేటు*
అదేవిధంగా సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ మహిళా నేతలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.
మహిళలని కూడా చూడకుండా మహిళల పై దాడి చేయడం సిగ్గుచేటు అని, కాంగ్రెస్ నిరంకుశ రాక్షస పాలనకు ఇది నిదర్శనమని మహిళా నేతలు, కార్యకర్తలు మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు, చైర్పర్సన్లు, డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, యువజన నాయకులు, మహిళలు, బూత్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







