వరంగల్, కార్పొరేషన్ మహా ;
ముంబైలోని బాంబే ఎగ్జిబిషన్ సెంటర్లో సెప్టెంబర్ 9 నుంచి 11 వరకు నిర్వహించనున్న 13వ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫర్ వేస్ట్ వాటర్ టెక్నాలజీ ఇండియా 2026లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టీ. వెంకన్న పాల్గొననున్నారు.
తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో ఎంపికైన మున్సిపల్ కమిషనర్లు, సీనియర్ అధికారులతో కూడిన ప్రతినిధి బృందంలో భాగంగా కమిషనర్ వెంకన్న ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. పట్టణ నీటి నిర్వహణ, మురుగునీటి శుద్ధి, ఘన వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్, బయోగ్యాస్, ఈ-వేస్ట్ తదితర ఆధునిక పర్యావరణ సాంకేతికతల పై నిర్వహించే ప్రదర్శనలు, సాంకేతిక సమావేశాలు, నిపుణులతో చర్చలు, జ్ఞాన మార్పిడి కార్యక్రమాల్లో కమిషనర్ వెంకన్న పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికతలు, ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి వరంగల్ నగరంలో పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు ఉపయోగపడనున్నాయి.








