Mahaa Daily Exclusive

  జోగుళాంబ అమ్మవారి కల్యాణోత్సవానికి సీఎం కి ఆహ్వానం.

Share

హైదరాబాద్‌, మహా .

జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో ఈ నెల 16న అత్యంత వైభవంగా నిర్వహించనున్న శ్రీ జోగుళాంబ అమ్మవారి కల్యాణోత్సవానికి విచ్చేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డిని ఆలయ కమిటీ ప్రతినిధులు కోరారు. శుక్రవారం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో దేవాదాయ శాఖ కమిషనర్‌ ఎం.హన్మంతరావు, గద్వాల సంస్థాన వారసుడు కృష్ణ రామభూపాల్‌, ఆలయ ఈవో దీప్తి తదితరులు సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.

ఈ సందర్భంగా అమ్మవారి తీర్థప్రసాదాలను ముఖ్యమంత్రికి సమర్పించి, ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను వివరించారు. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ శక్తి క్షేత్రాల్లో ఒకటైన అలంపూర్‌లో జరిగే ఈ వేడుకలకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.