Mahaa Daily Exclusive

  బతుకమ్మకు ప్రకృతి రమణీయతకు విడదీయరాని అనుబంధం…

Share

  • ఏమేమి పూవప్పునే గౌరమ్మ… అంటూ తీరొక్క పూలతో బతుకమ్మను పేరుస్తున్న యువతి..

ఇబ్రహీంపట్నం అక్టోబర్ 10 మహా:

పెత్తుల గ్రామానికి చెందిన ఆడపడుచులు తీరొక్క పూలతో బతుకమ్మను పేరుస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఇబ్రహీంపట్నం మండలం, పెత్తుల గ్రామానికి చెందిన యువతి, తీరొక్క పూలతో బతుకమ్మను పేరుస్తూ, సంబరాలు జరుపుకుంటూ బతుకమ్మ ప్రాధాన్యత గురించి చెప్పారు.

బతుకమ్మ పండగకు ప్రకృతి రమణీయతకు విడదీయరాని అనుబంధం ఉందనేందుకు నిదర్శనంగా బతుకమ్మలను ప్రకృతిలో లభించే వివిధ రకాల పూలు, ఆకులతో ఆకర్షణీయంగా తయారు చేసి భక్తి శ్రద్ధలతో మహిళలు పూజిస్తారని ఆమె కొనియాడారు. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృద్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి, భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకుంటుంది. ఈ సంబరాలు జరుపుకునే వారం అంతటా మహిళలు ‘బొడ్డెమ్మ‘ను బతుకమ్మతో పాటూ చేసి నిమజ్జనం చేస్తారని యువతి తెలిపారు.