- తిరుమలలో విజయ్ దేవరకొండ – రష్మిక
- ‘రణబాలి’ విజయం కోసం వెంకన్నకు ప్రత్యేక ప్రార్థనలు
- 16 న థియోటర్లలోకి రానున్న రణబాలి
తిరుమల, మహా : విజయ్ దేవరకొండ, రష్మికా మందన్న జంటగా నటించిన సినిమా ‘రణబాలి’. అక్టోబర్ 16వ తేదీన థియేటర్లలో భారీ ఎత్తున థియేటర్లలోకి రానుంది. పెళ్ళి తర్వాత వాళ్ళిద్దరూ జంటగా నటించిన మొదటి సినిమా కూడా ఇదే. ఈ నేపథ్యంలో తిరుమల వెంకన్న ఆశీస్సులు తీసుకున్నారు విజయ్, రష్మిక. మంగళవారం తెల్లవారుజామున తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా దంపతులు సందర్శించారు. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ప్రస్తుతం తిరుమలలో విరోష్ కపుల్ వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వాళ్ళిద్దరి విజువల్స్ వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో మంగళవారం సాయంత్రం ఆరున్నర లేదా ఏడు గంటల నుంచి ‘రణబాలి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఆ వేడుక కోసం హైదరాబాద్ చేరుకున్నారు విరోష్ కపుల్. ‘రణబాలి’ సినిమాను టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఇందులో హాలీవుడ్ హిట్ ‘ది మమ్మీ’ ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ విలన్ రోల్ చేశారు. ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత ద్వయం అజయ్ – అతుల్ మ్యూజిక్ అందించారు. ఆల్రెడీ అమెరికాలో బుకింగ్స్ స్టార్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనూ త్వరలో బుకింగ్స్ మొదలు కానున్నాయి. టికెట్ రేట్స్ హైక్ లేకుండా సాధారణ రేట్లతో సినిమాను విడుదల చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.








