- నర్సాపూర్ లో ఫుడ్ పాయిజన్
- ఒకరి మృతి.. 19 మందికి అస్వస్థత
- రెస్టారెంట్లో భోజనం చేసిన రెండు రోజులకు ఘటన
- ఆసుపత్రిలో బాధితులకు చికిత్స
మెదక్, మహా : మెదక్ జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. నర్సాపూర్లో కలుషిత ఆహారం తిని ఓ యువకుడు మృతి చెందగా, మరో 19 మంది అస్వస్థతకు గురయ్యారు. మృతుడిని సాయిరామ్ (19)గా గుర్తించారు. బాధితులందరినీ నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల ప్రకారం.. బాధితులంతా ఓ రెస్టారెంట్లో భోజనం చేశారు. ఆ తర్వాత వారు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఈ ఘటనలో సాయిరామ్ మృతి చెందగా, మరో 19 మంది చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. బాధితులు తిన్న ఆహారమే అస్వస్థతకు కారణమా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి నుంచి రక్త నమూనాలను సేకరించడంతో పాటు వన్ ప్యాలేస్ రెస్టారెంట్ లోని వంట వస్తువులను సేకరించి ల్యాబ్ కు పంపి పరీక్షల అనంతరం ఫుడ్ పాయిజన్ కు గల కారణాలేమిటన్న విషయంలో స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు.








