Mahaa Daily Exclusive

  కారేపల్లిలో దుర్గామాత మండపం వద్ద మహా అన్నదానం..

Share

  • కారేపల్లిలో దుర్గామాత మండపం వద్ద మహా అన్నదానం
  • -అన్నపూర్ణాదేవి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారు..
  • ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భక్తులు

కారేపల్లి, మహ: కారేపల్లి మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గల శివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద బుధవారం మహా అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని అన్నపూర్ణాదేవి అలంకరణలో ముస్తాబు చేయగా,భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.మహా అన్నదాన కార్యక్రమంలో గ్రామస్తులతోపాటు పరిసర ప్రాంత భక్తులు పాల్గొన్నారు.
మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాల్లోనూ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.ఆయా మండపాల్లో అమ్మవారిని వివిధ అలంకరణలతో అలంకరించి ప్రత్యేక పూజలు,అర్చనలు నిర్వహించారు.పలువురు దంపతులు పీటలపై కూర్చొని పూజల్లో పాల్గొన్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.దీంతో మండలంలోని పలు గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. దుర్గామాత మండపాల వద్ద భక్తుల సందడి కనిపించింది.