- టీఆర్పీ విశిష్ట గోల్డ్ షోరూం ప్రారంభం
నిజామాబాద్, మహా
నిజామాబాద్ సిటీలో మరో గోల్డ్ బ్రాండ్ టీఆర్పీ విశిష్ట అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రముఖ నటి నిధి అగర్వాల్ ఈ షోరూం ప్రారంభించగా, నిధిని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. హైదరాబాద్ లోని కొత్తపేట, జూబ్లిహిల్స్ లో ఇప్పటికే రెండు షోరూంలు నిర్వహిస్తూ గోల్డ్ మార్కెట్ లో విశ్వసనీయత సాధించిన టీఆర్పీ విశిష్ట ఇపుడు తొలిసారి నిజామాబాద్ పట్టణంలో అడుగుపెట్టింది. ప్రముఖ నటి నిధి అగర్వాల్ షోరూం ను ప్రారంభించడంతో పాటు యాజమాన్యాన్ని అభినందించింది. టీఆర్పీ విశిష్ట షోరూంలో గోల్డ్ అవసరం ఉన్నవారు కొనుగోలుచేయవచ్చని సూచించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించగా, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కూడా షోరూం ను సందర్శించి నిర్వాహకులు పాలభట్ల ఆనంద్, అభినందించారు. అనేకమంది ప్రముఖులు షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా రాగా, షోరూం కిటకిటలాడింది. నిధి అగర్వాల్ తన మాటలు, ఆటపాటలతో ఉత్సాహపరిచారు. నిజామాబాద్ లో విశిష్ట ప్రారంభోత్సవం హాట్ టాపిక్ గా ఆసక్తికర చర్చకు దారితీసింది. మోడల్ యాక్టివిటీ, బ్రాండింగ్ లో విశిష్ట నిజామాబాద్ లో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. బ్రాండ్ ఎక్స్ వో ఫౌండర్ కంది రామచంద్రారెడ్డి, ఆర్ బిఎం ఫౌండర్ శివప్రసాద్ లు టీఆర్పి విశిష్ట యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. నూతన వ్యాపారం రాకెట్ వేగంతో పురోగమించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బ్రాండ్ ఎక్స్ వో బిజినెస్ ఆపరేషన్స్ హెడ్ ప్రసన్నకుమార్ , ఎగ్జిక్యూటివ్ టీం వేణు, క్రాంతికుమార్, నరేష్ పాల్గొన్నారు.








