Mahaa Daily Exclusive

  డేంజర్ బెల్స్

Share

  • పాతాళానికి పడిపోతున్న భూగర్భ జలాలు
  • నీటి కష్టాలు తప్పవంటున్న నిపుణులు
  • క్రిటికల్ కేటగిరిలో ఏడు ప్రాంతాలు

హైదరాబాద్, మహా : హైదరాబాద్ మహానగరంతో పాటు దానికి ఆనుకుని ఉన్న జిల్లాల్లో నీటి సంక్షోభం తీవ్రరూపం దాల్చుతోంది. వార్షిక భూగర్భ జల వనరుల్లో దాదాపు 70 శాతానికి పైగా ఇప్పటికే తోడేయడంతో ఈ ప్రాంతాలు తీవ్రమైన గ్రౌండ్ వాటర్ స్ట్రెస్ (భూగర్భ జల ఒత్తిడి)ని ఎదుర్కొంటున్నాయి. 2025-26 సంవత్సరానికి సంబంధించిన ఇండియా-గ్రౌండ్ వాటర్ రిసోర్స్ ఎస్టిమేషన్ సిస్టమ్ అంచనాల ప్రకారం.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలతో కూడిన కోర్ అర్బన్ రీజియన్‌లో లభ్యమయ్యే 72,000 హెక్టార్-మీటర్ల వార్షిక భూగర్భ జలాల్లో.. ఇప్పటికే దాదాపు 48,000 హెక్టార్-మీటర్ల నీటిని తోడేసినట్లు తేలింది.

ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే భూగర్భ జలాల తోడకం పునరుద్ధరణ అయ్యే లభ్యత కంటే దాటిపోయింది. జిల్లాలోని మొత్తం 16 గ్రౌండ్ వాటర్ అసెస్మెంట్ యూనిట్లలో 15 యూనిట్లు క్రిటికల్ లేదా ఓవర్-ఎక్స్ ప్లోయిటెడ్ (అతిగా తోడేసిన) కేటగిరీ కిందకు చేరాయి. హైదరాబాద్ జిల్లా పరిధిలోని 8 ప్రాంతాలు ఓవర్-ఎక్స్ ప్లోయిటెడ్ కేటగిరీలో ఉన్నాయి. అందులోనివి అంబర్‌పేట్, అమీర్‌పేట్, ఆసిఫ్‌నగర్, చార్మినార్, గోల్కొండ, హిమాయత్‌నగర్, ఖైరతాబాద్, సైదాబాద్. మరో 7 ప్రాంతాలు క్రిటికల్ కేటగిరీలో ఉన్నాయి. అవి బహదూర్‌పురా, బండ్లగూడ, మారేడ్‌పల్లి, ముషీరాబాద్, నాంపల్లి, సికింద్రాబాద్, షేక్‌పేట్. లభ్యమయ్యే నీటిలో 90 నుండి 100 శాతం వరకు వాడితే ఆ ప్రాంతాన్ని ‘క్రిటికల్’గా, వాడకం 100 శాతం దాటిపోతే దానిని ఓవర్-ఎక్స్ ప్లోయిటెడ్ నిర్ధారిస్తారు. కాగా గత ఏడాది (2024-25) హైదరాబాద్‌లో 11 యూనిట్లు క్రిటికల్ లేదా ఓవర్-ఎక్స్ప్లోయిటెడ్ పరిధిలో ఉండగా, ఈ ఏడాది ఆ సంఖ్య 15కు పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. నివాస, వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాలు విపరీతంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని తెలంగాణ భూగర్భ జలాల శాఖ స్పష్టం చేసింది.

హైదరాబాద్ వాటర్ బోర్డు అందిస్తున్న నీరు నగర మొత్తం అవసరాలలో కేవలం 30 శాతం మాత్రమే తీర్చగలుగుతోంది. దీంతో మిగిలిన 70 శాతం అవసరాల కోసం గృహాలు, వ్యాపార సంస్థలు, పరిశ్రమలు పూర్తిగా బోర్ బావులపైనే ఆధారపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర జనాభాలో దాదాపు మూడో వంతు హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతంలోనే నివసిస్తున్నప్పటికీ, రాష్ట్ర వార్షిక భూగర్భ జల వనరులలో ఈ ప్రాంతానికి దక్కుతున్నది కేవలం 3 శాతం మాత్రమే. తెలంగాణలో లభ్యమయ్యే భూగర్భ జలాలు దాదాపు 21 లక్షల హెక్టార్-మీటర్లు కాగా.. క్యూర్ పరిధిలో ఉన్నది కేవలం 72,000 హెక్టార్-మీటర్లు మాత్రమే. హైదరాబాద్ ఎదుర్కొంటున్న సమస్య కేవలం నీటిని విపరీతంగా తోడేయడమే కాదు, భూమిలోకి ఇంకే నీటి శాతం పడిపోవడం కూడా ప్రధాన కారణం. నగరంలో వేగంగా జరుగుతున్న పట్టణీకరణ, విశాలమైన ఖాళీ స్థలాలు మాయమై కాంక్రీట్ రోడ్లు, భవనాలుగా మారడంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు పునరుద్ధరణ అయ్యే అవకాశం లేకుండా పోయింది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నగరంలోని ప్రతి నివాసం, కమర్షియల్ కాంప్లెక్స్‌లలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం తప్పనిసరి చేయాలి. నగర పరిధిలోని సహజ నీటి వనరులు, చెరువులను కబ్జాల బారిన పడకుండా కాపాడుకుని, వాటిని పూడిక తీత ద్వారా రీఛార్జ్ పాయింట్లుగా మార్చాలి. సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసిన నీటిని కన్‌స్ట్రక్షన్, తోటపని వంటి అవసరాలకు వాడాలి. ప్రతి పౌరుడు నీటి వృథాను అరికట్టి, భూగర్భ జలాల సంరక్షణలో భాగస్వామి కావాలి.న్నూర్‌ పోర్టులో అత్యధికంగా 222.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చెన్నై కేంద్రంలో 162 మిల్లీమీటర్లు, మీనంబాక్కం ఇస్రో కేంద్రంలో 126.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. చెంగల్పట్టు జిల్లాలోని వీఐటీ చెన్నైలో 78.5 మిల్లీమీటర్లు, తిరువళ్లూరు జిల్లాలోని జయ ఇంజినీరింగ్‌ కళాశాల కేంద్రంలో 59 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కల్లకురిచ్చిలో 44 మిల్లీమీటర్లు, రాణిపేటలో 42 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ గణనీయమైన వర్షపాతం నమోదైంది. తిరువారూరులో 37.5 మిల్లీమీటర్లు, కొడైకెనాల్‌ ఆటోమేటిక్‌ వాతావరణ కేంద్రంలో 32.9 మిల్లీమీటర్లు, మహాబలిపురంలో 31.5 మిల్లీమీటర్లు, తిరుపత్తూర్‌ కలెక్టరేట్‌ కేంద్రంలో 28 మిల్లీమీటర్లు, సేలం జిల్లాలోని మెట్టూరులో 22 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. చెన్నైలోని టీఎన్‌వీఏఎస్‌యూ మాధవరం కేంద్రంలో 61 మిల్లీమీటర్లు, సేలంలోని సంధియూరులో 32.5 మిల్లీమీటర్లు, దిండిగల్‌లోని ఎంఎస్‌ఆర్‌ఎఫ్‌ కన్నివాడి కేంద్రంలో 17 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.