- కూతురు ఫిర్యాదుతో మహిళా ఉద్యోగి, ఐదుగురిపై చర్యలు.
భద్రాచలం, మహా:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గ్యాస్ గోడౌన్ మేనేజర్‌గా పనిచేసిన అనంతుల లక్ష్మీనారాయణ (57) ఆత్మహత్య కేసులో భద్రాచలం పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. మృతుడి కుమార్తె మధులిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహిళా ఉద్యోగి రజిత, ఆమె భర్త నాయిని రాజేష్, నలుగురు మీడియా ప్రతినిధులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తన తండ్రిపై నమోదైన లైంగిక వేధింపుల ఫిర్యాదును ఉపసంహరించుకోవాలంటే రూ.కోటి ఇవ్వాలని రజిత, ఆమె భర్తతో పాటు మీడియా ప్రతినిధులు ఒత్తిడి చేశారని మధులిక తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఆరోపణలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.ఈ కేసులో మహిళా ఉద్యోగి, ఆమె భర్త నాయిని రాజేష్, 10 టీవీ రిపోర్టర్ నాగ చందు, బిగ్ టీవీ రిపోర్టర్ వెంకన్న, టీవీ9 రిపోర్టర్ రవి, కలీంపై కేసు నమోదైనట్లు సమాచారం.








