చండీ హోమం చేసిన దంపతులు ఎమ్మెల్యే
కారేపల్లి, మహా :కారేపల్లి మండలం ఉసిరికాయపల్లి కోట మైసమ్మ తల్లి ఆలయాన్ని సోమవారం వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్- లలిత దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఎమ్మెల్యే దంపతులకు కోట మైసమ్మ ఆలయ చైర్మన్ డాక్టర్ పర్స పట్టాభి రామారావు, ఆలయ ఈవో కే వెంకటయ్య ఆధ్వర్యంలో ఆలయ. మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయంలో వేదపండితులు యలమంచలి ప్రసాద్ శర్మ నిర్వహిస్తున్న చండీ హోమంలో ఎమ్మెల్యే దాంపతులు పాల్గొని పూజలు చేశారు. రాష్ట్రంలో కరువు కాటకాలు లేకుండా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. చండీ హోమంలో ఎంపీడీవో పద్మ, తహసిల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లు, ఉసిరికాయలపల్లి సర్పంచ్ దంపతులు వరలక్ష్మి రాజు పాల్గొని పూజలు నిర్వహించారు.








