Mahaa Daily Exclusive

  ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు.

Share

  •  రైతన్నకు తగిన ఫలితం.. మహిళలకు సాధికారతే లక్ష్యం.
  •  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

అమరావతి, మహా:

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని తన సామాజిక మాధ్యమ ఖాతా ద్వారా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దసరా పండుగ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.

రైతుల శ్రమకు తగిన ఫలితం దక్కాలని, మహిళలకు సాధికారత కలగాలని, యువతకు మెరుగైన భవిష్యత్తు అందించాలనే ప్రభుత్వ సంకల్పానికి జగన్మాత అనుగ్రహం లభించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తన సందేశంలో పేర్కొన్నారు.

కనకదుర్గమ్మ ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్‌ అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తూ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ విజయదశమి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.