Mahaa Daily Exclusive

  పోలీస్ స్టేషన్‌ ఆకస్మిక తనిఖీ

Share

  • పోలీస్ స్టేషన్ నిర్వహణలో నిర్లక్ష్యానికి తావులేకుండా విధులు నిర్వర్తించాలి
  • వరంగల్ సీపీ ఎన్. శ్వేత, ఐపీఎస్

వరంగల్, క్రైం మహా ;

వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, ఐపీఎస్ బుధవారం ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, స్టేషన్ పరిసరాలు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ శుఖూర్‌కు పలు కీలక సూచనలు చేస్తూ, పోలీస్ స్టేషన్‌ను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలని, విధుల పట్ల పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునితో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడంలో నిర్లక్ష్యానికి తావులేకుండా విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీలో వరంగల్ ఇన్‌చార్జి ఏసీపీ నర్సింహరావు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.