Mahaa Daily Exclusive

  నరకాసురుని వధ కార్యక్రమానికి బల్దియా కమిషనర్ కు ఆహ్వానం..

Share

*నరకాసురుని వధ కార్యక్రమానికి బల్దియా కమిషనర్ కు ఆహ్వానం

*ఉత్సవ కమిటీ అధ్యక్షులు మరుపల్ల రవి

 

వరంగల్, మహా;

 

భారతీయులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ అయిన దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ ఆరో తేదీన జరుగు ఉత్సవములు జయప్రదం కావడానికి తమరు విచ్చేయవలసిందిగా వరంగల్ మహా నగర పాలక సంస్థ కమిషనర్ వెంకన్న కు నరకాసుర వధ ఉత్సవ కమిటీ అధ్యక్షులు మరుపల్ల రవి ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రికను అందజేశారు. ఉర్సు గుట్ట కుడా మైదానంలో 58 ఫీట్ల ఎత్తుగల నరకాసురుని ప్రతిమకు పెద్ద ఎత్తునబాంబులు అమర్చి పేల్చి వేస్తామని సాయంత్రం 6:00 నుండి 9 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొంటారని కమిషనర్ వెంకన్నకు నరకాసుర వధ ఉత్సాహ కమిటీ అధ్యక్షులు మరుపల్ల రవి వివరించారు. అలాగే వరంగల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపాల నవీన్ రాజ్ లకు ఆహ్వాన పత్రికలను అందజేసారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు మరుపల్ల గౌతమ్ ఆవు నూరి రామ్మూర్తి దూడే బాల కొమురెల్లి వనం కుమార్ శెట్టి మోహన్ తవటం నరసింహ కుండె రాజు ఆవునురీ ఐలేశం పొలం రంజిత్ కుండే సదానందం గౌడ కోటేశ్వర్ బలబద్ర శివకృష్ణ ఉన్నారు.