Mahaa Daily Exclusive

  బల్దియా ఇంచార్జి అదనపు కమిషనర్‌గా సమ్మయ్య..

Share

 

వరంగల్,కార్పొరేషన్ మహా;

ఇటీవలే బల్దియా అదనపు కమిషనర్ ఇసంపల్లి జోనా పదవి విరమణ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా అదే స్థానంలో బల్దియా ఇంచార్జి అదనపు కమిషనర్‌ గా నియమితులైన సమ్మయ్య సోమవారం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ టి.వెంకన్న ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అదనపు కమిషనర్ జోనా పదవీ విరమణతో ఏర్పడిన ఖాళీ నేపథ్యంలో సీనియర్ అధికారి అయిన సమ్మయ్యకు ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు.