Mahaa Daily Exclusive

  వరంగల్ లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం..

Share

  • వరంగల్ లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం
  • డ్రైనేజీ కాలువల నుంచి పొంగిపొర్లుతున్న మురుగు నీరు
  • దుర్గంధంతో ప్రజల నరకయాతన
  • పట్టించుకోని బల్దియా అధికారులు

పోచమ్మ మైదాన్, మహా ;

గ్రేటర్ వరంగల్ స్మార్ట్ సిటీ నగరంలోని ప్రధాన కూడలి అయిన పోచమ్మ మైదాన్ జంక్షన్ లో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది. వరంగల్ నగరంలోని బట్టల బజార్, హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి పోచమ్మ మైదాన్ వరకు వేసిన కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన అండర్ డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అట్టర్ ప్లాప్ అయింది. మండి బజార్ లోని బిర్యాని హోటల్స్ ద్వారా చెత్తాచెదారం, ప్లాస్టిక్ బాటిల్స్, నూనెతో కూడిన వ్యర్థ పదార్థాలు, మురుగు కాలువల్లో కలవడం తో డ్రైనేజీ కాలువలు నిండిపోయి మురుగునీరు రోడ్లపైకి వచ్చి అత్యంత దుర్వాసన రావడం ఈ మురుగు నీరు జంక్షన్లో సిగ్నల్ పాయింట్ వద్ద పొంగిపొర్లి రోడ్డు పై నిలవడంతో అక్కడ వేచి ఉండే వాహనదారులు, పాదచారుల తో పాటు స్థానిక వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాథుడే లేడని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా బల్దియా అధికారులు సిబ్బంది స్పందించి డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని నగర ప్రజలు కోరుతున్నారు.